డ్రైవింగ్ లైసెన్స్ లేదని బాధపడకండి.. ఇకనుండి లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్ అవసరంలేదట!

ప్రస్తుత పరిస్థితులలో డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే అదొక పెద్ద ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు.అప్లయ్ చేసిననాటినుండి అది పూర్తయే వరకు ఓ సంవత్సర కాలమైనా పడుతుంది.

 Do Not Worry If You Do Not Have A Driving License. No More Need For A Driving Te-TeluguStop.com

అందువలన వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.చాలామంది, ఈ ప్రాసెస్ తెలియని వారు ‘ఈ గొడవంతా ఎందుకులే!’ అనుకొని లైసెన్స్ తీసుకొని పరిస్థితి కూడా వుంది.

ఇలాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని RTA తన నియమనిబంధలను కాస్త సవరించింది.ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో ఈ సవరణలు జరిగాయి.

విషయం ఏమంటే, లైసెన్స్ కావాలనుకునేవారు డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందే వీలుని కల్పించారు.మీరు వింటున్నది నిజమే.కేంద్రం నిర్ణయం తీసుకున్నాక, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా తాజాగా జారీ చేయడం జరిగింది.కొత్త నిబంధనల ప్రకారం డ్రైవింగ్ స్కూళ్లకు, డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలకు కూడా తగిన గుర్తింపు ఇవ్వనుంది.

ప్రభుత్వంతో గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో విజయవంతంగా డ్రైవింగ్ టెస్ట్ పూర్తి చేస్తే.RTA నుంచి లైసెన్స్ పొందవచ్చు.

ఐతే అదే సమయంలో శిక్షణ కేంద్రాలకు పూర్తి స్వేచ్ఛ మాత్రం ఉండదు.

Telugu Licence, Drive, Latest-Latest News - Telugu

దీనికోసం, అనుమతులు, శిక్షణా కార్యక్రామల పర్యవేక్షణ వంటి వ్యవస్థ ఏర్పాటవుతుంది.ప్రభుత్వమే కొన్ని డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్ని గుర్తిస్తుంది, లేదంటే ఏర్పాటు చేసే వీలుంది.వాటికి కొన్ని నియమ నిబంధనల్నీ జారీ చేస్తుంది.

వాటి ప్రకారమే డ్రైవింగ్ కేంద్రాలు నడవాల్సి ఉంటుంది.ఇక ఆ నియమ నిబంధనలు ఈ రకంగా ఉంటాయి.

2 చక్రాలు లేదా 4 చక్రాల వాహనాల ట్రైనింగ్ స్కూల్ కోసం కనీసం 1 ఎకరం స్థలం, భారీ వాహనాల శిక్షణా కేంద్రం కోసం 2 ఎకరాల స్థలం ఖచ్చితంగా ఎన్నుకోవాలి.శిక్షణా కేంద్రం నాణ్యత కలిగిన డ్రైవింగ్ ట్రాక్ టెస్టులను నిర్వహించాలి.

అలాగే లైట్ వెహికిల్స్‌కు శిక్షణా సమయం కనిష్టంగా 29 గంటలు.గరిష్టంగా 4 వారాలు, మధ్యస్థ, భారీ మోటారు వాహనాల శిక్షణకు కనిష్ట సమయం 38 గంటలు, గరిష్టంగా 6 వారాలలోపు పూర్తి అవ్వాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube