ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రజలు తమ చిన్న వయసులోనే వృద్ధాప్యం( Old Age ) బారిన పడుతున్నారు.30 సంవత్సరాలు దాటకుండానే వృద్ధాప్య ఛాయలు మన శరీరంపై అల్లుకుంటూ ఉన్నాయి.అయితే చిన్న వయసులోనే ముసలి వాళ్ళ లాగా కనిపిస్తున్నారా.? అలాంటివారు ఈ విషయాలు తెలుసుకుంటే చాలా సింపుల్ గా వృద్ధాప్యం నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యంగా అలాగే అందంగా ఉండవచ్చు.ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం ఎంతో మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మరి ఆ ఆహార పదార్థాలు( Food ) ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కెఫిన్ అనే పదార్థాన్ని అధికంగా తీసుకోవడం వల్ల చర్మంలోని కణాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

ప్రాసెస్ చేసిన మాంసంలో గ్రైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్( Glycation End Products ) ఉంటాయి.ఇవి చర్మాన్ని వృద్ధాప్యం వచ్చేలా చేస్తాయి.ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండి మంచి నట్స్ తింటూ వ్యాయామం చేస్తే ఫిట్ అండ్ గ్లామరస్ గా ఉండవచ్చు.
అలాగే షుగర్ కంటెంట్( Sugar Content ) అధికంగా ఉన్న వాటిని తినడం వల్ల శరీరంలో కొల్లాజన్ ఉత్పత్తిని( Collagen ) తగ్గిస్తుంది.ఈ కారణంగా కూడా చర్మం యవ్వనాన్ని కోల్పోతుంది.
ఇంకా చెప్పాలంటే జంక్ ఫుడ్, చాట్ ఐటమ్స్, పానిపూరి లాంటివి తినడం వల్ల కూడా వృద్ధాప్యం త్వరగా చేరుతుంది.ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చర్మం డిహాడ్రేషన్( Dehydration ) కు గురవుతుంది.
తద్వారా చర్మం పొడిబారడం తేమ తగ్గిపోవడం లాంటివి జరుగుతాయి.

ఇది యవ్వనాన్ని, చర్మ సౌందర్యాన్ని తగ్గించేలా చేస్తుంది.అందుకే ఆల్కహాల్ జోలికి అస్సలు పోకూడదు.ఇక కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలు, పిజ్జాలు, బర్గర్లు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు( Cholesterol ) పెరుగుతుంది.
అందువల్ల చర్మం ముడతలు పడుతుంది.అందుకే వీలైతే లైట్ ఆయిల్ ఆహారాలను తీసుకుంటూ ఉండాలి.
అలాగే స్వీట్స్, కేకులు అంటే ఇష్టపడని వారు ఎవ్వరు ఉండరు.ప్రతి ఒక్కరికి ఈ ఆహారపదార్థాలు అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది.
షుగర్ కంటెంట్ బాగా ఎక్కువగా ఉన్న వాటిని తినడం వల్ల శరీరంలో కొల్లాజన్ శాతం ఉత్పత్తిని తగ్గిస్తుంది.దీని వల్ల చర్మం యువ్వనాన్ని కోల్పోతుంది.
కాబట్టి ఈ ఆహర పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.