కేజిఎఫ్ ఫేమ్ రవీనాటాండన్ వెంకటేష్ తో సినిమా చేసింది.. ఈ విషయం మీకు తెలుసా?

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాలో రమిక సేమ్ పాత్రలో రవీనాటాండన్ నటన ఎంత అద్భుతంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రవీనా టాండన్ పాత్ర ఏకంగా సినిమాను కీలక మలుపు తిప్పే విధంగా ఉంటుంది.

 Raveena Tandon Movie Tollywood Hero Venkatesh Details, Raveena Tandon, Venkatesh-TeluguStop.com

ఆమె నటన పై ప్రస్తుతం ప్రశంసలు కురిపిస్తున్నారు.దీంతో రవీనాటాండన్ గురించి సోషల్ మీడియాలో అన్నీ విషయాలు తెలుసుకోవడం చేస్తున్నారు నెటిజన్లు.

ఈ క్రమంలోనే గూగుల్ తల్లిని ఆశ్రయిస్తూ ఒక షాకింగ్ విషయం తెలిసి తెలుగు ప్రేక్షకులు అవాక్కవుతున్నారు.కే జి ఎఫ్ ఫేమ్ రవీనాటాండన్ ఏకంగా టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తో సినిమా చేశారట.

ఏంటి మా విక్టరీ వెంకటేష్ తో కేజిఎఫ్ ఫేమ్ రవీనా తాండన్ సినిమా చేసిందా.మాకు తెలియకుండా ఆ సినిమా ఎప్పుడు వచ్చిందబ్బా అని అనుకుంటున్నారు కదా.దాదాపు ఈ సినిమా గురించి ఎవరికీ తెలియదు అని చెప్పాలి.సాధారణంగా వెంకటేష్ ప్రతి సినిమాలో ఒక కొత్త హీరోయిన్ దర్శనమిస్తూ ఉండేది.

పలు సినిమాలలో బాలీవుడ్ హీరోయిన్లతో కూడా కలిసి నటించాడు వెంకటేష్.ఈ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ వెంకీ కాంబినేషన్ లో కూడా సినిమా వచ్చిందట.

Telugu Kgf Chapter, Ramanaidu, Raveena Tandon, Raveenatandon, Krishna, Takdeerwa

సాధారణంగా ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం అప్పుడు ఇప్పుడు కామన్ గా కొనసాగుతోంది.ఈ క్రమంలోనే అప్పట్లో పెద్ద హీరోల సినిమాల పోటీని తట్టుకుని సూపర్ హిట్ అయిన ఒక సినిమాను వెంకటేష్ తో తీయాలని తండ్రి రామానాయుడు అనుకున్నారట.రీమెక్స్ రైట్స్ కోసం ప్రయత్నించారు.అంతకంటే ముందుగానే సూపర్ స్టార్ కృష్ణ రైట్స్ తీసుకున్నారట.

Telugu Kgf Chapter, Ramanaidu, Raveena Tandon, Raveenatandon, Krishna, Takdeerwa

ఇక ఆ తర్వాత రామానాయుడు అడగడంతో తానే వెంకటేష్ తో సినిమా తీస్తానని అన్నారట కృష్ణ.దీంతో ఆ తర్వాత మురళీ మోహన్ రావు దర్శకత్వంలో హిందీలో సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో రవీనాటాండన్ వెంకటేష్ జోడిగా థక్ధీర్ వాలా అనే పేరుతో రీమేక్ చేశారు అయితే ఈ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచిపోయిందట.ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఏ సినిమా రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube