చీరలో అదరగొట్టే డ్యాన్స్ వేసిన బెంగాలీ అమ్మాయి.. వీడియో చూస్తే..!

డ్యాన్స్ చేస్తున్నప్పుడు బ్యాక్‌ఫ్లిప్ వంటి కష్టమైన మూవ్స్ చేయడం చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమవుతుంది.అలాంటిది చీరలో బ్యాక్‌ఫ్లిప్ చేయడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు.

 Bengali Girl Dancing In A Sari If You Watch The Video ,dance, Viral Latest, Vira-TeluguStop.com

కానీ పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌కు చెందిన మిలీ సర్కార్ అనే ప్రొఫెషనల్ డ్యాన్సర్, జిమ్నాస్ట్ కి ఇలా చేయడం చాలా సులభం.ఈ బెంగాలీ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యాక్‌ఫ్లిప్‌లు, ఇతర జిమ్నాస్టిక్ మూవ్స్ సంబంధించి వీడియోలను పోస్ట్ చేస్తుంది.

మిలీ సర్కార్ విన్యాసాలు నెటిజన్లను ఎప్పుడూ అబ్బుర పరుస్తూనే ఉంటాయి.తాజాగా మరో వీడియోతో ఈ బెంగాల్ అమ్మాయి నెటిజన్లను బాగా ఫిదా చేస్తోంది.ఈ వీడియోలో చీరలో బ్యాక్‌ఫ్లిప్ చేస్తూ కనిపించింది.ఈ వీడియో ఏప్రిల్ 2న ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరల్ గా మారింది.“చీరలో డ్యాన్స్,” అని ఈ వీడియోకి ఆమె ఓ క్యాప్షన్ జోడించింది.

వైరల్ అవుతున్న వీడియోలో చీర కట్టుకున్న ఒక అమ్మాయి చాలా సునాయాసంగా బ్యాక్‌ఫ్లిప్ చేయడం చూడొచ్చు.

చీరలో చాలా సులభంగా బ్యాక్‌ఫ్లిప్‌లను ప్రదర్శించడం బహుశా ఈ అమ్మాయి కి మాత్రమే సాధ్యం అయ్యిందేమో.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తగినట్లుగా ఈ యువతి చాలా చక్కగా డ్యాన్స్ చేసి అదరగొట్టింది.

ప్రతి స్టెప్ కూడా వేరే లెవల్లో ఉందంటే అతిశయోక్తి కాదు.ఈమెలో ఎనర్జీ చూస్తే ఎవరికైనా సరే ఉత్సాహం ఉప్పొంగుతుంది.

మిలీ సర్కార్ జిమ్నాస్టిక్ భంగిమలో డ్యాన్స్‌లో అద్భుతమైన ప్రదర్శన చూపించడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది.

ఈ అమ్మాయి ఇంత బాగా డ్యాన్స్ చేసింది కాబట్టే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోకి ఇప్పటికే 30 వేల వ్యూస్ వచ్చాయి.మిలీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ రెండు లక్షల ఫాలోవర్లను కలిగి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube