అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం తన తదుపరి చిత్రంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం బాలకృష్ణ తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాలో భారీ యాక్షన్ షెడ్యూల్ ను సిరిసిల్లలో నిర్వహించారు.
ఈ షెడ్యూల్ లో భాగంగా బాలకృష్ణ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.
ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో ఈ భారీ యాక్షన్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి జరిగింది.
ఈ క్రమంలోనే చిత్రబృందం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ప్రస్తుతం సిరిసిల్లలో యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే హైదరాబాద్ లో మరో షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించనున్నారు.
ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన క్రాక్ బ్యూటీ శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.క్రాక్ సినిమా ద్వారా మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న గోపీచంద్ మలినేని తన తదుపరి చిత్రాన్ని బాలయ్యబాబుతో ప్లాన్ చేయడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.ఇక ఈ సినిమాకి వేటపాలెం అనే టైటిల్ పరిశీలనలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు.ఇక ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.