రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవలే విడుదల అయిన విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకోవడం తో పాటుగా ఊహించని విధంగా భారీగా వసూళ్లు రాబట్టింది.
ఇప్పటికీ ఈ సినిమా వాసవి వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది దూసుకుపోతోంది.ఆర్ఆర్ఆర్ సంచనాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా ఊహించినదానికంటే అసాధారణంగా వసూళ్లు సాధిస్తూ అజేయంగా కొనసాగుతోంది.ఈ సినీమా విడుదల అయ్యి పది రోజులు అవుతున్నా కూడా బాలీవుడ్ లో కలెక్షన్ల పరంగా అసాధారణంగా ఉంది అని హిందీ ట్రేడ్ వెల్లడించింది.
ఈ సినిమా హిందీ బెల్ట్ లో 200 కోట్ల మార్కును దాటుతోంది.మార్చి 25 న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. హిందీ బెల్ట్ లో ఈ సినిమా 5 రికార్డులను ఇప్పటికే బ్రేక్ చేసింది అన్న రిపోర్ట్ అందింది.ఇక పోస్ట్ పాండమిక్ లో ది కాశ్మీర్ ఫైల్స్ అద్భుత వసూళ్లతో ఆకట్టుకుంది.
దీనికంటే ముందు గంగుబాయి కతీయావాడి సినిమా చక్కని వసూళ్లను అందుకుంది. ఇటీవల రిలీజైన ఎటాక్ అయితే ఆర్ఆర్ఆర్ కి దరిదాపుల్లో కూడా లేదు.
కానీ ఆ రెండు కలెక్షన్లను అధిగమించి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాగా ఆర్ఆర్ఆర్ సినిమా నిలిచింది.ఈ సినిమా విడుదలై రెండవ వారంలో ఏప్రిల్ 2న శనివారం నాడు ఏకంగా ఇరవై కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది అని ట్వీట్ చేశారు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం.
ఇక తొలి అంచనాల ప్రకారం డే 9 వసూళ్లు రూ.20 కోట్ల నికర స్థాయిలో ఉన్నాయి.అత్యద్భుతంగా ఉంది అని #RRRMovie అని ట్వీట్ లో వెల్లడించారు.మరో ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఇప్పటికే ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ ఏప్రిల్ 1 శుక్రవారం వరకు రూ.146.09 కోట్లు వసూలు చేసిందని వివరాల్ని అందించారు.ఈ సందర్బంగా అతను ట్వీట్ చేస్తూ.రెండవ శని, ఆదివారాల్లో పెద్ద వృద్ధిని అంచనా వేస్తున్నాం అని ట్వీట్ చేసారు.అలాగే 2 వ వారం శుక్ర 13.50 కోట్లు కలెక్షన్ కాగా మొత్తంగా 146.09 కోట్లు వసూళ్లు అయ్యింది. ఢిల్లీ,NCR,గుజరాత్,ఉత్తరప్రదేశ్ – ముంబై వంటి మాస్ సర్క్యూట్ లతో కూడిన హిందీ బెల్ట్ లో రూ.200 కోట్లను అధిగమించగలదు అని అంచనా వేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా 800కోట్లు వసూలు చేసి 1000 కోట్ల క్లబ్ వైపు వడి వడిగా దూసుకుపోతోంది.