టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్.భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవల్ లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని ఊహించిన విధంగా భారీ వసూళ్లు రాబట్టింది.
ఈ సినిమాలో ఇద్దరు హీరోల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించారు.
ఇప్పటికే ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.
ఈ సినిమాలో ఇద్దరు హీరోల నటనకుగాను ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు వారి పై ప్రశంసల వర్షం కురిపించారు.
అయితే దర్శకుడు రాజమౌళి ఇద్దరు హీరోలను సమానంగా చూపించి నప్పటికీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం రామ్ చరణ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఇద్దరు స్టార్ హీరోలు పాన్ ఇండియా స్టార్ లుగా మారిపోయారు.
అంతే కాకుండా ఈ సినిమా ఇద్దరు స్టార్ హీరోల కెరియర్ లో బెస్ట్ సినిమాగా నిలుస్తుంది అని అభిమానుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు బాగానే ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ అభిమానుల మధ్య మళ్ళీ గొడవ మొదలైంది.ఒకవైపు రామ్ చరణ్ అభిమానులు బెస్ట్ యాక్టర్ అవార్డు చెర్రీకి ఇవ్వాలి అని, మరొకవైపు ఎన్టీఆర్ అభిమానులు తారక్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇంకొంతమంది నెటిజెన్స్ ఇద్దరు హీరోలకు కూడా బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని కోరుకుంటున్నారు.
ఈ సినిమా జాతీయ అవార్డును అందుకుంటుందో లేదో తెలియాలన్నా, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు బెస్ట్ యాక్టర్ అవార్డు ను అందుకుంటారో లేదో తెలియాలంటే కొన్ని నెలలు వేచి చూడాల్సిందే.