2024 ఎన్నికల్లో గెలవడం అనేది తెలుగుదేశం పార్టీకి అత్యవసరం.2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓటమి చెందడం, ఎప్పుడూ లేని విధంగా కేవలం 23 స్థానాలకే పరిమితం కావడం ఇలా అనేక కారణాలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూర్తిగా నిరుత్సాహం అలుముకుంది చాలాచోట్ల పార్టీ నాయకులు యాక్టివ్ గా ఉండకపోవడం, పార్టీ పిలుపునిచ్చినా, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించడం లేదు.దీంతో పాటు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా టిడిపి ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం సొంత పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు .లోకేష్ కు పార్టీ పగ్గాలతో పాటు, ప్రభుత్వ పగ్గాలు అప్పజెప్పితే టిడిపి పరిస్థితి మరింతగా దిగజారుతుందని , ఆయన రాజకీయంగా అసమర్థుడనే అభిప్రాయం లో చాలామంది టిడిపి నాయకులు ఉన్నారనే విషయాన్ని చంద్రబాబు గుర్తించారు. అందుకే రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే తానే ముఖ్యమంత్రినని పదేపదే చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు.ఇటీవల అసెంబ్లీలోనూ తాను మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీ లో అడుగు పెడతానంటూ శపథం చేయడం వెనుక కారణం ఇదేనట.
లోకేష్ కాదు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అనే విషయాన్ని బాబు హైలెట్ చేసుకుంటున్నారు.టిడిపి మళ్లీ అధికారంలోకి రావాలంటే పార్టీకి దూరమైన వారందరిని దగ్గర చేసుకోవాలనే విషయాన్ని గుర్తించారు .ముఖ్యంగా నందమూరి కుటుంబం అండదండలు తమకు ఉండేలా చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారు.పరోక్షంగా చంద్రబాబుకు నందమూరి కుటుంబం నుంచి మద్దతు లభిస్తుందని ఈ సారి ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో ప్రత్యక్షంగానే ఆ కుటుంబం మద్దతు పొందాలనేది చంద్రబాబు అభిప్రాయం.
అందుకే ఈసారి నందమూరి కుటుంబంతోను ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష ఎన్నికల ప్రచారం కి రాకపోయినా, మీడియా, సోషల్ మీడియా ద్వారా ఆయన టిడిపి తరఫున ప్రచారానికి దించాలని , ఆయన మద్దతు ఉంటే టిడిపి గెలుపునకు ఎటువంటి డోకా ఉండదనే లెక్కల్లో బాబు ఉన్నారట.బాబు కు ఇదే చివరి చాన్స్ కావడంతో పాటు , టిడిపి భవిష్యత్తు దృష్ట్యా , నందమూరి కుటుంబం రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు సిద్ధంగానే ఉందనే సంకేతాలు చంద్రబాబులో కొత్త ఆశలు చిగురింప చేస్తున్నాయి.