విజయవాడ: బిజెపి ఎంపి జి.వి.
యల్. ఎపి లో 26 జిల్లాల పునర్విభజన చేస్తూ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది.జిల్లాల పునర్విభజన కు బిజెపి ఎప్పుడో ఆమోదం తెలిపింది.రెండేళ్లు ఆలస్యం గా చేసినా… ప్రక్రియ ను సరైన రీతిలో చేయడం లేదు.ముందస్తు ఏర్పాట్లు, ప్రణాళిక లేకుండా హడావుడిగా చేస్తున్నారు.కలెక్టరేట్ లు ఏర్పాటు చేస్తే అక్కడ అనువైన సౌకర్యాలు ఉన్నాయా.
ఎపి విభజన ఎలా జరిగిందో… అదే హడావిడిగా చేయడం సరికాదు.జిల్లాల్లో మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించాలి కదా.అప్పు తెచ్చుకుని పాలన చేసే ప్రభుత్వం కనీసం పాత జిల్లాలకు వంద కోట్లు అయినా ఇవ్వాలి కదా.కొత్త జిల్లాల్లో పరిపాలన గాడిలో పెట్టేందుకు 200కోట్లు అత్యవసరంగా కేటాయించాలి.లేకుంటే అమరావతి తరహాలో అభివృద్ధి, వసతులు లేకుండా పోతుంది.2014లో జరిగిన ప్రక్రియ తరహాలో జగన్ జిల్లాల పునర్విభజన చేస్తున్నారు.
జగన్ వెంటనే నిధులు కేటాయించి, వసతులు ఏర్పాటు చేసేలా చూడాలి.అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది.అమరావతి ని పూర్తిగా నిర్వీర్యం చేసేలా జగన్ చర్యలు ఉన్నాయి.భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తున్నారు.
అమరావతి లో భూములు కొన్న వారు పెట్టుబడి పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.కేంద్రం కూడా తమ సంస్థలు ఏర్పాటు కు సిద్దంగా ఉంది.
మేము మౌలిక వసతులు కల్పిస్తామని ఆయా సంస్థ లకు ప్రభుత్వం తరపున జగన్ లేఖ రాయాలి.అమరావతి అభివృద్ధి కి నిధులు ఇవ్వాలని జగన్ ఒక్క లేఖ అయినా కేంద్రానికి రాశారా.
మీరు పని చేయరు… చేసేందుకు ముందుకు వస్తే అడ్డుకుంటారు.
త్వరలో అమరావతి రైతులు ఢిల్లీ వెళ్లనున్నారని తెలిసింది.
అమరావతి కి అన్యాయం చేయను అంటున్న జగన్ .అదే నిజమైతే కోర్ట్ లో అఫిడవిట్ ఎందుకు వేశారు.ధాన్యం కొనుగోలు పై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు నేను స్వయంగా లేఖ రాశాను.34వేల కోట్లు కేటాయించి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎపికి ఇచ్చింది.రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనకుండా.అసత్యాలతో పార్లమెంటు ను తప్పుదోవ పట్టించారు.కేంద్రం స్పందించి స్వతంత్ర సంస్థ లతో విచారణ చేపించాలని కోరాను.ఎపి లో ధాన్యం కొనుగోళ్లు, పక్కదారి పడుతున్న రేషన్, దోచుకుంటున్న పరిస్థితి ని కట్టడి చేయాలి.
కేవలం అధికారులతో మాట్లాడి వదలడం కాదు.రైతులతో నేరుగా మాట్లాడి .వారికి న్యాయం జరిగేలా చూడాలి.రైస్ మిల్లర్లు దళారులను అడ్డం పెట్టుకుని కొంతమంది రైతులను దోచుకుంటున్నారు.
పక్క దారి పడుతున్న బియ్యం, విదేశాలకు తరలిపోతున్న వైనం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.పంచాయతీ రాజ్ వ్యవస్థ ను నీరు గార్చేలా జగన్ విధానాలు ఉన్నాయి.
ఉత్తరాంధ్ర లో అభివృద్ధి కి నోచుకోని నీటి ప్రాజెక్టు లను పరిశీలిస్తాం.ఈనెల 7,8,9 తేదీలలో యాత్ర ద్వారా టిడిపి, వైసిపి వైఫల్యాలను ప్రజలకు వివరిస్తాం.రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్న ప్రాజెక్టు లను ఎందుకు నిర్మించడం లేదో సమాధానం చెప్పాలి.ఉత్తర, కోస్తా జిల్లాల్లో తాగునీటి సమస్య కూడా బాగా ఉంది.
ఈ సమస్య పరిష్కారం కోసం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టాలి.రాష్ట్రంలో డ్రామా రాజకీయాలు ఆడే టిడిపి, వైసిపి ల ఆటలు ఇక చెల్లవు.
గత, ప్రస్తుత ప్రభుత్వాలు తీరుతో ప్రజలు విసిగిపోయారు.ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా బిజెపి కార్యక్రమం నిర్వహిస్తుంది.