దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.
ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుందని ప్రకటించడంతో అందరు హ్యాపీ గా ఉన్నారు.
తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అన్ని చోట్ల జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.మరొక మూడు రోజులు మాత్రం ఉండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నారు.
మన తెలుగులో కూడా ప్రొమోషన్స్ జోరు పెంచారు.ఇప్పటికే అనిల్ రావిపూడి, కీరవాణి లు హోస్ట్ లుగా ఇంటర్వ్యూలు చేసిన టీమ్ తాజాగా సుమ తో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
యాంకర్ సుమ తో చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు మరింత ఆకట్టు కుంటుంది ఈ ఇంటర్వ్యూ ను ఇటీవలే రిలీజ్ చేయగా మిగతా వాటికంటే కూడా ఈ ఇంటర్వ్యూ ను నెటిజెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.సుమ ఉంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈమె ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పూయిస్తుంది.ఇక్కడ కూడా సుమ వాక్ చాతుర్యంతో.తారక్ పంచులతో ఈ ఇంటర్వ్యూ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది.
ఈ ఇంటర్వ్యూ లో తారక్ సుమపై సంచలన వ్యాఖ్యలు చేసాడు.సుమ ను గయ్యాళి అంటూ ఆమెకు సూర్యకాంతం లాంటి రోల్స్ ను ముసలి ఆవిడ రోల్స్ ఇవ్వాలని తెలిపాడు.ఈ ఇంటర్వ్యూ ఆద్యంతం మీమ్స్ ను చూపించి సుమ అలరించింది.
చివరిలో మీమర్స్ కు రాజమౌళి థాంక్స్ కూడా తెలిపాడు.ఈ ఇంటర్వ్యూ మొత్తం తారక్ అక్కడక్కడ సుమ పై పంచ్ లు వేయడం ఆమె చిన్నబుచ్చుకోవడం వంటివి అలరించాయి.