వైసీపీ ఆ విభాగాల్లో ర‌చ్చ‌..! ప‌తాకస్థాయికి ఆధిప‌త్య‌పోరు !

పార్టీ అంటే అంద‌రూ క‌లిసిక‌ట్టుగా స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి.పార్టీలో విభాగాలుంటే స‌మిష్టిగా ముందుకు సాగాలి.

 Ycp Writes In Those Sections Do Not Dominate The Flagship , Digital Media , Ap-TeluguStop.com

లాభ‌నష్టాలు బేరీజు వేసుకుంటూ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో రాజ‌కీయాలు న‌డ‌పాలి.కానీ, వైసీపీలో ఇందుకు భిన్నంగా ఉంద‌నే వాద‌న వ‌స్తోంది.

వైసీపీ సోష‌ల్ మీడియా, వైసీపీ డిజిట‌ల్ మీడియా రెండు విభాగాల్లోనూ ఆధిప‌త్య పోరు ర‌చ్చ‌కెక్కుతోంది.ఈ రెండు వైసీపీకి అత్యంత కీల‌క‌మైన విభాగాలు.

పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డంలో ప్ర‌ధాన భూమిక పోషించాయి.అలాంటి వాటిలో వార్ అంటే ఆశ్చ‌ర్యం వేయ‌క‌మాన‌దు.

Telugu Ap Ycp, Chandrababu, Ministers, Lokesh, Tdp Mlas, Ycp, Ys Jagan-Telugu Po

గ‌తంలో 2016-17 లో వైసీపీ సోష‌ల్ మీడియాలోని సాబుల మ‌ధ్య పెద్ద యుద్దం జ‌రిగినంత ప‌నైంది.వెంట‌నే వైసీపీ అధిష్టానం జోక్యం చేసుకుని ఇరువురిని శాంతింప చేసింది.ఇక 2019 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ తిరిగి జోష్ అందుకుంది.జ‌గ‌న్ సీఎం ల‌క్ష్యంగా స‌మిష్టిగా కృషి చేశారు.టీడీపీ అధినేత బాబు, టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా ప‌సుపు దండుపై సోష‌ల్ మీడియా వేదిక‌గా దండ‌యాత్రే చేశారు.ఇది జ‌గ‌న్ గెలుపున‌కు దోహ‌ద‌ప‌డింది.

కాగా వైసీపీ రెండు సోష‌ల్ మీడియాలను యూత్ అధికంగా ఫాలో అయ్యారు.వీరి ఓట్ల‌తోనే వైసీపీ గెలిచింది.

ఇక రెండున్న‌రేండ్ల వైసీపీ పాల‌నలో యువ‌త‌కు చేసిందేమైనా ఉందా అంటే అదీ లేదు.దీంతో యూత్ వైసీపీ సోష‌ల్ మీడియాను .రొచ్చు… అంటూ కామెంట్ చేశారు.మ‌రోవైపు ఉన్న ప్ర‌భుత్వ డిజిట‌ల్ మీడియాను అస‌లే ప‌ట్టించుకోని ప‌రిస్థితి.

ఇదే విష‌య‌మై ఒక వైసీపీ డిజిట‌ల్ మీడియా హెడ్ వైసీపీ సోష‌ల్ మీడియాను అవ‌హేళ‌న చేస్తూ వ్యాఖ్యానించ‌డం ర‌చ్చ‌కు దారి తీసింద‌ని స‌మాచారం.అత‌నే గ‌తంలో కూడా ఇత‌ర పార్టీ వారికి సాయం చేశాడంటూ ఫొటోలు పెడుతూ.

స‌ద‌రు వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు.ఇలా వైసీపీ రెండు ప్ర‌ధాన మీడియాల్లో ఆధిప‌త్య పోరు ప‌తాకస్థాయికి చేరుకుంది.

విషయం అధిష్టానానికి తెలిసినా ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని తెలిసింది.మ‌రి టీడీపీ సోష‌ల్ మీడియా ప‌రుగులు పెడుతున్న క్ర‌మంలో వైసీపీ డిజిట‌ల్ మీడియా దూకుడు త‌గ్గితే .2024 ఎన్నిక‌ల నాటికి గెలుపుపై ప్ర‌భావం ప‌డ‌క‌మాన‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube