మంత్రి గౌతమ్ రెడ్డి మృతికి అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా పలువురు మంత్రులు మరియు ఎమ్మెల్యేలు… గౌతమ్ రెడ్డి తో తనకున్న అనుబంధం గురించి మంత్రిగా ఆయన పనితీరు గురించి ప్రసంగించారు.
అనంతరం సిఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ గౌతమ్ రెడ్డి లేని లోటు పూడ్చలేనిది అని స్పష్టం చేశారు.గౌతమ్ రెడ్డి మృతి తనకి, పార్టీకి మరియు రాష్ట్రానికి కూడా తీరని లోటు అని తెలియజేశారు.
గౌతమ్ రెడ్డి తనకు చిన్ననాటి నుండి స్నేహితుడు అని… చాలా సందర్భాలలో తనకు అండగా నిలబడ్డారు అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీతో విభేదించిన సమయంలో నేను ఈ స్థాయికి వస్తానని… ఊహించలేదు.
అటువంటి సమయంలో… నా వెంట…బలంగా నిలబడింది గౌతమ్ రెడ్డి అని పేర్కొన్నారు.పారిశ్రామిక మంత్రిగా గౌతమ్ రెడ్డి అద్భుతమైన పనితీరు కనపరిచారు అని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో గౌతం రెడ్డి చిరస్థాయిగా గుర్తుండిపోయేలా… నెల్లూరు జిల్లాలో మర్చిపోకుండా తన స్థానం ఉండేలా… మరో ఆరు వారాలలో సంగం బ్యారేజీ పనులు పూర్తి కానున్న తరుణంలో… సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడుతున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.

సంగం బ్యారేజీ కి సంబంధించి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు.మంచి స్నేహితుడిని కోల్పోయాను బాధాకరమని పేర్కొన్నారు.
గౌతమ్ రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని.మేకపాటి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు వైసీపీ పార్టీ అండగా ఉంటుందని .ప్రతినాయకుడు తోడుగా ఉంటారని వైయస్ జగన్ స్పష్టం చేశారు.