సగం విన్నాక రాధేశ్యామ్ కథకు నో చెప్పాలనుకున్న ప్రభాస్.. ఆ తర్వాత ఏమైందంటే?

ఏ సినిమా అయినా సక్సెస్ సాధించాలంటే కథ కీలకమనే సంగతి తెలిసిందే.కథ బాగుంటే మాత్రమే పెద్ద హీరోల సినిమాలైనా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించే అవకాశాలు ఉంటాయి.

 Interesting Facts About Prabhas Radheshyam Movie Details, Prabhas, Radheshyam, G-TeluguStop.com

కథ బాగా లేకపోతే ఏ హీరో నటించినా సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.స్టార్ హీరో ప్రభాస్ తన ఇమేజ్ కు భిన్నమైన కథ అయిన రాధేశ్యామ్ సినిమాలో నటించి సక్సెస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.

యాక్షన్ సన్నివేశాలు లేకుండా ప్రభాస్ నటించిన ఈ సినిమా రిజల్ట్ కోసం ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

పెదనాన్న కెరీర్ ను మార్చిన సంస్థ గోపీకృష్ణా మూవీస్ అని ఈ బ్యానర్ లో సినిమా చేయడం అంటే తనకు టెన్షన్ గా ఉంటుందని ప్రభాస్ చెప్పుకొచ్చారు.పెదనాన్నతో కలిసి ఈ బ్యానర్ లో బిల్లాలో నటించగా ఆ సినిమా హిట్టైందని ప్రభాస్ తెలిపారు.

రాధేశ్యామ్ విషయంలో టెన్షన్ పడ్డానని అయితే ఏ సమస్య వచ్చినా పెదనాన్న నుంచి మద్దతు లభించిందని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

Telugu Astrology, Billa, Radhakrishna, Gopikrishna, Krishnam Raju, Prabhas, Radh

కృష్ణంరాజుతో కలిసి సినిమాలో తాను రెండు సీన్లలో కనిపిస్తానని ప్రభాస్ కామెంట్లు చేశారు.ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ నిడివి 13 నిమిషాలు ఉంటుందని ప్రభాస్ చెప్పుకొచ్చారు.రాధాకృష్ణ కుమార్ కథ చెబుతున్న సమయంలో సగం విన్నాక నో చెప్పాలని అనుకున్నానని ప్రభాస్ అన్నారు.

Telugu Astrology, Billa, Radhakrishna, Gopikrishna, Krishnam Raju, Prabhas, Radh

తాను ఆస్ట్రాలజీని నమ్మను కాబట్టి నో చెప్పాలని అనుకున్నానని అయితే కథ విన్నాక ఆసక్తిగా అనిపించిందని ప్రభాస్ చెప్పుకొచ్చారు.రాధేశ్యామ్ సినిమాలో థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉన్నాయని ప్రభాస్ వెల్లడించారు.ప్రభాస్ అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube