బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలే అని చెప్పవచ్చు.
ఏ విషయం గురించి అయినా కుండలు బద్దలు కొట్టేలా మాట్లాడే వ్యక్తిత్వం గల కంగనా రనౌత్ నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉండడమే కాకుండా రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ప్రస్తుతం ఏక్తాకపూర్ నిర్మిస్తున్న లాక్ అప్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కంగనా ప్రస్తుతం ఈ కార్యక్రమం ద్వారా కెరీర్ మొదట్లో తనకు జరిగిన ఎన్నో అవమానాలు గురించి వివరించారు.తనకు ఏ విధమైన సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం వల్ల చాలామంది తనను చూసి హేళన చేసే వారని, తను వచ్చిన ప్రాంతం తన భాషను ఆటపటిస్తూ నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపొమ్మని చెప్పారని,నన్ను ఇండస్ట్రీ లో లేకుండా చేయాలని చూశారనీ ఈ సందర్భంగా కంగనా తెలియ చేశారు.
ఇక తనకు ఇండస్ట్రీలో మొదటి నుంచి తనకు ఎంతో సపోర్ట్ గా నిలబడిన వారిలో ఏక్తాకపూర్ ఒకరు.తను నాకు మొదటి నుంచి ఎంతో మద్దతు తెలుపుతుందని తన నిర్మాణంలో మంచి హిట్ కూడా అందుకున్నానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కంగనా రనౌత్ కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్న అవమానాలు కష్టాల గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.