వృద్ధుడి లాటరీ డబ్బుపై కన్ను.. కొట్టేయడానికి స్కెచ్, యూకేలో భారత సంతతి మహిళకు జైలు

1,30,000 పౌండ్ల విలువైన లాటరీ మొత్తాన్ని వృద్ధుడి నుంచి కొట్టేయడానికి ప్రయత్నించిన భారత సంతతి షాప్ మేనేజర్‌కు యూకే కోర్టు 28 నెలల జైలు శిక్ష విధించింది.వివరాల్లోకి వెళితే.

 Indian-origin Shop Manager Jailed For 28 Months For Cheating On Lottery Win In U-TeluguStop.com

నార్త్ ఇంగ్లాండ్ నగరమైన లీడ్స్‌కు చెందిన 81 ఏళ్ల ఫ్రాంక్ గౌలాండ్ అనే వృద్ధుడు.స్థానికంగా షాపింగ్ సెంటర్‌లో దుకాణం నిర్వహిస్తోన్న నరేంద్ర గిల్ అనే భారత సంతతి మహిళ వద్దకు వెళ్లాడు.

ఈ సందర్భంగా తాను కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్‌కు ప్రైజ్ తగిలిందా లేదా అనే దానిపై తనిఖీ చేయమని కోరాడు.ఈ క్రమంలో గౌలాండ్ టికెట్‌‌ లాటరీ కొట్టినట్లుగా తేలింది.

కానీ దీనికి ఎలాంటి ప్రైజ్ రాలేదని చెబుతూ.నరేంద్ర గిల్ ఆ టికెట్‌ను తన వద్ద వుంచుకుంది.

ఇద్దరు పిల్లల తల్లి అయిన గిల్.తాను దొంగతనం, మోసానికి పాల్పడినట్లు కోర్టులో నేరాన్ని అంగీకరించింది.ఇందుకు గాను లీడ్స్ క్రౌన్ కోర్టు ఆమెకు 28 నెలల జైలు శిక్ష విధించింది.ఈ చర్య నమ్మలేని క్రూరత్వమని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి అభివర్ణించారు.

మిలియన్ పౌండ్ల విలువ చేసే వ్యవహారాలను నిర్వహించే వారి విషయంలో నమ్మకం చాలా ముఖ్యమని న్యాయమూర్తి అన్నారు.అలాంటి స్థానాల్లో వున్న వారు తాము నమ్మకమైన వ్యక్తులమని ప్రజల మనసుకు తెలిసేలా ప్రవర్తించేలా వ్యాఖ్యానించారు.

యూకేలో ‘‘యూరో మిలియన్స్’’ అనే పేరిట లాటరీని నడుపుతోన్న ‘‘కేమ్‌లాట్’’ అనే సంస్థకు నరేంద్ర గిల్ ఫోన్ చేయడంతో వారికి అనుమానం వచ్చింది.గిల్.కస్టమర్లకు సేవలందించే వ్యక్తిగా వారికి తెలిసింది.తాను లీడ్స్‌లోని వైట్ రోజ్ షాపింగ్ సెంటర్‌లోని జీటీ న్యూస్‌లో పనిచేస్తున్నట్లు గిల్ తెలిపింది.తనకు టికెట్‌ను బహుమతిగా ఇచ్చారని.అది ఎక్కడ కొనుగోలు చేశారో తెలియదని కట్టుకథ చెప్పింది.

కంపెనీ వారికి అనుమానం తీరకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గౌలాండ్‌ను నరేంద్ర గిల్ ఎలా మోసం చేసింది తెలుసుకుని , పోలీసులకు సమాచారం అందించారు.

తనకు జరిగిన మోసాన్ని కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో షాక్‌కు గురయ్యానని గౌలాండ్ పేర్కొన్నారు.

తనకు ఫోన్ కాల్ వచ్చే వరకు లాటరీ గెలుస్తానని అనుకోలేదని ఆయన చెప్పారు.లాటరీ గెలవడంతో తన జీవితం మారిపోయిందని.తన అప్పులన్నీ తీర్చి, కొత్త కారు కొనుక్కున్నానని గౌలాండ్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube