నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సదా ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగారు.ఇలా తెలుగు తమిళ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సదా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ బుల్లితెర కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు.
ఇలా ఈమె చిరునవ్వుతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇక ఏకంగా తన నవ్వుతో పులులను కూడా ఫిదా చేస్తోంది.
నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సదా ఉన్నఫలంగా వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా మారిపోయారు.
సదా తన స్నేహితులతో కలిసి కన్హా జాతీయ టైగర్ ఫారెస్ట్ లో సందడి చేస్తూ పులులల ఫోటోలను తన కెమేరాలతో బంధిస్తుంది.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలు పై నెటిజన్లు స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం సదా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈ ఫోటోలో పై స్పందించిన నెటిజన్లు ఆమె ధైర్యానికి ఫిదా అవుతున్నారు.గత కొంతకాలం నుంచి సదా సినిమా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న సదా ఏ మాత్రం తన క్రేజ్ తగ్గకుండా చూసుకుంటున్నారు.ఇక వెండి తెరకు దూరమైన ఈమె బుల్లితెరపై పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.