కేసీఆర్ కు అద్దంకి అభినందనలు

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణాకు ఒక ఐకాన్ గా యాదాద్రి క్షేత్రం విరాజిల్లుతుందని,ఇంత గొప్ప ఆలయంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ కు అభినందనలు చెబుతున్నానని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు.యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని గురువారం కుటుంబ సభ్యులతో అద్దంకి దయాకర్ దర్శించుకున్నారు.

 Congratulations To Kcr-TeluguStop.com

అనంతరం యాదగిరిగుట్ట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.శైవ,వైష్ణవ సంప్రదాయాల మేలి కలయికగా ఉన్న తెలంగాణ ప్రాంతంలో వైష్ణవ ఆలయాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయో యాదాద్రి ఆలయాలపై అలాగే దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.

సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటే మోడీ సంతోష పడుతున్నాడని,ప్రధాని మోడీ తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తే కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు.వీరిద్దరు ఒక డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.

మోడీ సర్కార్ కు వ్యతిరేకమని పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ ఎనిమిది దశలుగా ఎన్నికలు జరుగుతున్న ఉత్తర ప్రదేశ్ లో బీజేపీని ఓడగొట్టమని ఎందుకు పోలేదని ప్రశ్నించారు.ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ వంచిస్తూ ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలు చేస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిఆర్ఎస్ పార్టీకి 20 సీట్లు దాటవని జోస్యం చెప్పారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసి బీజేపీ,టిఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నారన్నారు.

మోడీ కంపెనీలను అమ్ముకుంటే,కేసీఆర్ భూములను అమ్ముకుంటున్నారని ఆయన విమర్శించారు.ధరణి అనే వెబ్ పోర్టల్ ఒక చీటర్ అన్నారు.

ధరణితో అవినీతి పెరిగిపోయిందన్నారు.అనుభవదారు కాలం తీసివేయడం అనేది దేశ ద్రోహమన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల అయిలయ్య,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు,పట్టణ అధ్యక్షుడు భరత్ గౌడ్,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా ఇంఛార్జి గుడ్ల వరలక్ష్మీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు నర్సింహ,నరేష్,అజయ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube