క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల అయ్యి ప్రేక్షకులను సందడి చేసింది.
ఇక ఈ సినిమా ఉత్తరాది రాష్ట్రాలలో ఏకంగా వంద కోట్ల కలెక్షన్లను రాబట్టింది.ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో థియేటర్ల వద్ద రికార్డులు సృష్టించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యి ప్రేక్షకులను సందడి చేసింది.
ఇలా పుష్ప సినిమా మంచి క్రేజ్ దక్కించుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ విధంగా థియేటర్, ఓటీటీలో ఈ సినిమా విడుదలై మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇకపై బుల్లితెర ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి పుష్పరాజ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా కైవసం చేసుకుంది.త్వరలోనే పుష్ప వరల్డ్ ప్రీమియర్ గా స్టార్ మాలో ప్రసారం కాబోతుంది.త్వరలోనే ఈ సినిమా స్టార్ మా లో ప్రసారం చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

థియేటర్, ఓటీటీలో ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన పుష్పరాజ్ బుల్లితెర ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో తెలియాల్సి ఉంది.ఇకపోతే ఈ సినిమా రెండవ పార్ట్ కి సంబంధించి షూటింగ్ పనులను త్వరలోనే చిత్రబృందం ప్రారంభించనున్నారు.ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న చిత్రబృందం త్వరలోనే పార్ట్ 2 చిత్రీకరణతో బిజీ కానున్నారు.