భారత ఆటోమొబైల్ రంగంలో కియా ఓ సంచలనంగా మారింది.ఈ సంస్థ విడుదల చేసిన కార్లు మన దేశంలో విపరీతంగా అమ్ముడుపోతున్నాయి.
కియా సెల్టోస్, కియా సోనెట్, కియా కార్నెస్, కియా కార్నివాల్ ఇలా పలు మోడళ్ల కార్లపై భారతీయుల్లో మోజు పెరుగుతోంది.ఫలితంగా మన దేశంలో ఏపీలోని అనంతపురం జిల్లాలో కియా కార్ల తయారీ ప్లాంటును స్థాపించింది.
ఈ కంపెనీ కార్లు అన్ని రంగాలల్లోనూ నాణ్యమైన విధానాలను పాటిస్తుండడంతో వినియోగదారులు కొనేందుకు మక్కువ చూపుతున్నారు.తాజాగా ఈ కియా కంపెనీ రూపొందించిన ఓ కొత్త కారు పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోతోంది.
ఆ కారుకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం.
అంతర్జాతీయ స్థాయిలో నం.1 ర్యాంకుకియా కంపెనీ రూపొందించే కార్లు అత్యంత నాణ్యతగా ఉంటాయని వినయోగదారులు చెబుతున్నారు.దీనిని ధ్రువీకరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఓ సర్వేలో విషయం వెల్లడైంది.
జేడీ పవర్ అనే సంస్థ ఇటీవల వివిధ దేశాల్లో సర్వే నిర్వహించింది.అందులో అత్యంత నాణ్యత కలిగిన కారుగా కియా సంస్థ ఎస్యూవీ విభాగంలో తయారు చేసిన సొరెంటో కారు నిలిచింది.
కార్లు వినియోగించే యజమానుల నుంచి జేడీ పవర్ సంస్థ సర్వే చేపట్టింది.రిపేర్లు, విడిభాగాల రీప్లేస్మెంట్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ వంటి అంశాల ఆధారంగా సర్వే చేసింది.
దాదాపు 31 కంపెనీల కార్లను ఆ జాబితాలో చేర్చి, ఏది ఉత్తమమో తెలపాలని కార్ల యజమానులకు కోరింది.ఇందులో కియా సొరెంటో అత్యుత్తమని ఎక్కువ మంది ఓటేశారు.
*త్వరలో భారత్ మార్కెట్లోకి* లగ్జరీ, మెయిన్ స్ట్రీమ్ విభాగంలో అత్యంత మన్నిక కలిగిన కారుగా కియా సొరెంటో నిలిచింది.ఈ కారు ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో లేదు.త్వరలో దీనిని కూడా భారత మార్కెట్లో ప్రవేశపెట్టే వీలుందని తెలుస్తోంది.దాదాపు రూ.25 లక్షల ధరతో దీనిని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు మార్కెట్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.మరి ఈ మిడ్ రేంజ్ ఎస్యూవీకి మన దేశంలో ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి.