రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది.ఈ సందర్భంగా రష్యా ఏ ఆయుధాలను ఉపయోగించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి ఆయుధం:
ఈ రష్యా ఆయుధం పేరు 9K720. ఇస్కాండర్ బాలిస్టిక్ మిస్సైల్.ఇది తక్కువ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగివుంది.దీనిని రష్యా సైన్యం ప్రత్యేకంగా సిద్ధం చేసింది.
రెండవ ఆయుధం:
ఈ ఆయుధం పేరు Bm-30 Smerch MBR. ఇది భారీ రాకెట్ లాంచర్.సాఫ్ట్ టార్గెట్‌లు, బ్యాటరీలు, కమాండ్ పోస్ట్‌లు మొదలైన వాటికి ఇది ప్రత్యేకమైనది.
మూడవ ఆయుధం:
మూడవ ఆయుధం బీఎంపీటీ టెర్మినేటర్ ట్యాంక్. బీఎంపీటీ టెర్మినేటర్ అనేది ట్యాంక్ సపోర్ట్ ఫైటింగ్ వెహికల్.ఈ ట్యాంక్ శత్రు హెలికాప్టర్లను, తక్కువ వేగంతో ఎగిరే విమానాలను ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది.ఈ ట్యాంక్‌ను రష్యన్ కంపెనీ ఉరల్‌వాగోంజావోడ్ తయారు చేసింది.
నాల్గవ ఆయుధం:
నాల్గవ ఆయుధం Tor-M2 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి. ఈ క్షిపణి.దాని వేగం, దూరానికి ప్రసిద్ధి చెందింది.దీని పరిధి 16 కి.మీ.
ఐదవ ఆయుధం:
ఐదవ ఆయుధం KA-52 ఎలిగేటర్ హెలికాప్టర్.ఇది రష్యన్ సైన్యానికి చెందిన శక్తివంతమైన ఆయుధాలలో ఒకటి.శత్రువులకు భారీ నష్టం కలిగించడంలో ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.
ఆరవ ఆయుధం:
ఉక్రెయిన్ విధ్వంసంలో T-80 మ్యాన్ యుద్ధ ట్యాంక్‌తో కూడా దాడి చేశారు.ఇది రష్యా తయారు చేసిన ప్రత్యేక ట్యాంక్.ఇది T-64ను అభివృద్ధి చేసిన అనంతరం తిరిగి రూపొందించారు.ఇది ముఖ్యంగా గ్యాస్ టర్బైన్ ఇంజిన్‌కు ప్రసిద్ధి చెందింది.
ఏడవ ఆయుధం:
సుఖోయ్ SU-35 యుద్ధ విమానం.ఇది రెండు ఇంజిన్‌ల యుద్ధ విమానం.ఇది ఒకేసారి చాలా దూరం ప్రయాణించగలదు.దీని పనితీరు చాలా అద్భుతమైనదిగా పేరొందింది.
ఎనిమిదవ ఆయుధం:
ఎనిమిదో ఆయుధం TU-95 వ్యూహాత్మక భారీ బాంబర్. ఇది ప్రత్యేకమైన నాలుగు ఇంజన్ల బాంబర్.భారీ విధ్వంసం కలిగించడానికి ఇదొక్కటే సరిపోతుందని చెబుతుంటారు.