అంతుపట్టకుండా జగ్గారెడ్డి వ్యవహారం... ఇక కొనసాగుతున్నట్టేనా?

తెలంగాణ కాంగ్రెస్ రోజు రోజుకు పెద్ద ఎత్తున బలపడేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.అయితే కాంగ్రెస్ లో ఎంతగా అంతర్గత విభేదాలు ఉంటాయనేది మనం స్పష్టంగా చెప్పుకోనవసరం లేదు.

 Otherwise The Jaggareddy Affair ... Is It Going On Anymore?/ Telangana Politics,-TeluguStop.com

అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడం అన్నది అనివార్యమైనటువంటి విషయం.అయితే జగ్గారెడ్డి అంశం అనేది కాంగ్రెస్ లో అవచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో ఎంతగా సంచలనం సృష్టించిందో మనం చూస్తున్నాం.

అయితే మొదట్లో తనపై జరుగుతున్న కోవర్ట్ ప్రచారంపై ఆగ్రహంతో రాజీనామాస్త్రం సంధించిన విషయం తెలిసిందే.

అయితే కాంగ్రెస్ సీనియర్ ల జోక్యంతో మరల కొన్ని రోజులు తన రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకొన్న జగ్గారెడ్డి రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో నాకు అపాయింట్ మెంట్ ఇప్పించాలని జగ్గారెడ్డి తెలపడంతో ఏఐసీసీ నుండి స్పందన రావడం, భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఎమ్మెల్యే దుద్ధిల్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన జగ్గారెడ్డితో సమావేశమైన విషయం తెలిసిందే.

అయితే ఆ తరువాత తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని అందరూ భావించినా అధిష్టానంతో చర్చలు జరిపాకే తన తుది నిర్ణయాన్ని వెల్లడిస్తానని అన్నారు.

అయితే జగ్గారెడ్డిని బుజ్జగించే ప్రయత్నం రేవంత్ చేయలేదన్నది సుస్పష్టం.ఏఐసీసీ తో దగ్గరి సంబంధాలున్న వారు అధిష్టానం దగ్గరికి ఈ సమాచారాన్ని చేరవేయడంతో అధిష్టానం స్పందించింది.అయితే జగ్గారెడ్డి అభ్యంతరాలను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా రేవంత్ రెడ్డితో ఈ విషయాన్ని చర్చిస్తుందా లేక సాధారణమైన సమస్యగానే చూస్తుందా అనేది చూడాల్సి ఉంది.

అయితే జగ్గారెడ్డి రాజీనామాతో  కాంగ్రెస్ కు అంతగా నష్టం లేకపోయినా అంతో ఇంతో బలంగా ఉన్న మెదక్ జిల్లాలో కాంగ్రెస్ బలహీనపడే అవకాశం ఉంది.మరి జగ్గారెడ్డి రానున్న రోజుల్లో ఎలా వ్యవహరిస్తారనేది చూడాల్సి ఉంది.

Otherwise The Jaggareddy Affair Is It Going On Anymore?/ Telangana Politics

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube