సినిమా రంగానికి చెందిన హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు క్యాస్టింగ్ కౌచ్ పై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని కొంతమంది చెబితే మరి కొందరు మాత్రం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.
ప్రముఖ నటి స్నేహా శర్మ క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.స్నేహా శర్మ నా ప్రేమ నాకు కావాలి అనే ఇండిపెండెంట్ మూవీలో నటించారు.
నా ప్రేమ నాకు కావాలి ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఈ నటి ఇండస్ట్రీలో తనకు కూడా క్యాస్టింగ్ కౌచ్ లాంటి ఇబ్బందులు ఎదురయ్యాయని కమిట్మెంట్ కు నో చెప్పడం వల్ల ఒక సినిమాలో ఆఫర్ ను కోల్పోయానని ఆమె చెప్పుకొచ్చారు.కమిట్మెంట్ వల్ల పెద్ద సినిమాలలో కూడా తాను అవకాశాలను కోల్పోవాల్సి వచ్చిందని స్నేహా శర్మ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
తాను అడుక్కు తిని అయినా జీవనం సాగిస్తాను కానీ కమిట్మెంట్ మాత్రం ఇవ్వనని స్నేహాశర్మ పేర్కొన్నారు.కమిట్మెంట్ అడిగే వాళ్లు అడుగుతారని అయితే ఆ విషయంలో మనమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్నేహాశర్మ చెప్పుకొచ్చారు.కమిట్మెంట్ విషయంలో బలవంతాలు మాత్రం ఉండవని ఆమె కామెంట్లు చేశారు.కమిట్లెంట్ల వల్ల ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
సినిమా పెద్దలు ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడిగే వాళ్ల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.గతంలో పలువురు స్టార్ హీరోయిన్లు సైతం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని తమకు మాత్రం అలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని వెల్లడించారు.
క్యాస్టింగ్ కౌచ్ వల్ల సినిమా ఇండస్ట్రీపై సాధారణ ప్రేక్షకుల్లో కూడా నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుండటం గమనార్హం.