భీమ్లా నాయక్ సినిమా దెబ్బకు వెనక్కి తగ్గిన బుక్ మై షో!

సాధారణంగా ఒక సినిమా విడుదల అవుతుంది అంటే ముందు గానే టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఎన్నో ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి.ఈ క్రమంలోనే చాలా మంది బుక్ మై షో ద్వారా ముందుగా టికెట్లు బుక్ చేసుకుంటారు.

 Bheemla Nayak Movie Book My Show App Is Step Backed, Bheemla Nayak, Tollywood, P-TeluguStop.com

ఇక పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈనెల 25వ తేదీన విడుదల కావడంతో ఇప్పటికే బుక్ మై షో ద్వారా అడ్వాన్స్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు.కరోనా పరిస్థితుల నేపథ్యంలో టికెట్ ధరల విషయంలో అదనపు చార్జీలు తగ్గించు కోవాలని బుక్ మై షోను నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ కోరారు.

అయితే టికెట్ ధరల విషయంలో అదనపు చార్జీలను తగ్గించుకునే ఉద్దేశ్యమే లేదని బుక్ మై షో తేల్చి చెప్పింది.ఇలా తమ నిర్ణయంలో ఏ విధమైనటు వంటి మార్పులు చేసుకోకపోతే టికెట్లను నేరుగా థియేటర్లోనే అమ్మాలని డిస్ట్రిబ్యూటర్లు డిసైడ్ అయ్యారు.

ఈ విధంగా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో బుక్ మైషో ఓ మెట్టు దిగిందనే చెప్పాలి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాను మిస్ చేసుకుంటే తీవ్రస్థాయిలో నష్టపోవాల్సి వస్తుందని భావించిన బుక్ మై షో అదనపు చార్జీల విషయంలో వెనక్కు తగ్గి డిస్ట్రిబ్యూటర్స్ చెప్పిన కండిషన్ లకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.ఇక టికెట్ పై 11 శాతం అదనపు చార్జీలను వసూలు చేయకుండా థియేటర్లను బట్టి అదనపు చార్జీలను 5 లేదా 6 శాతానికి తగ్గించడానికి బుక్ మైషో అంగీకరించినట్లు తెలుస్తోంది.ఈ విధంగా డిస్ట్రిబ్యూటర్స్ తో చర్చలు ముగిసిన అనంతరం బుక్ మై షో ద్వారా టికెట్లు బుకింగ్ ఓపెన్ కావడంతో వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఈ రేంజ్ లో హంగామా ఉండడం సర్వసాధారణం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube