టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ‘లైగర్’.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా కోసం విజయ్ కూడా చాలా కష్ట పడుతున్నాడు.
ఈ సినిమా ఇప్పటికి షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.అయితే ఇందులో ఒక స్పెషల్ సాంగ్ ఉందట.ఈ సాంగ్ లో నటించేందుకు పూరీ జగన్నాథ్ కేజీఎఫ్ హీరోయిన్ తో మంతనాలు జరుపుతున్నట్టు టాక్ నడుస్తుంది.కేజీఎఫ్ సినిమా ద్వారా దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి.
ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయించాలని ఆమెతో సంప్రదిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.అయితే ఈమె కూడా అందుకు అంగీకారం తెలిపినట్టే తెలుస్తుంది.విజయ్ దేవరకొండ కి కావలసినంత క్రేజ్ ఉంది.దీంతో ఈ బ్యూటీ విజయ్ తో స్టెప్పులు వేయడానికి రెడీగా ఉందని తెలుస్తుంది.ఈ సినిమా తర్వాత మరోసారి పూరీ జగన్నాథ్, విజయ్ కాంబోలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
లైగర్ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాను మళ్ళీ విజయ్ తోనే తీయాలని ఫిక్స్ అయ్యాడు.ఈ సినిమా కూడా త్వరగానే సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక జనగణమన సినిమాను కూడా పూరీ తన బ్యానర్ మీద నిర్మిస్తున్నాడు.