ఆ ఆలోచన వస్తేనే టెన్షన్ మొదలవుతుంది... హీరో కార్తికేయ సంచలన వ్యాఖ్యలు!

ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అనంతరం ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన మొదటి సినిమా విజయవంతం కావడంతో వరుస అవకాశాలు వస్తున్నాయి.

 Tension Starts When I Thought That Hero Karthikeyan Sensational Comments, Karthi-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా తమిళ హీరో అజిత్ తో కలిసి వలిమై అనే చిత్రంలో హీరో కార్తికేయ విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు.హెచ్ వినోద్ దర్శకత్వంలో బోని కపూర్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తికేయ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో విలన్ గా నటించే అవకాశం వస్తే మీరు చేస్తారా? అనే ప్రశ్న హీరో కార్తికేయకు ఎదురయింది.ఈ ప్రశ్నకు కార్తికేయ ఎంతో ఆసక్తికరమైన సమాధానాలు వెల్లడించారు.మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలలో విలన్ గా అవకాశం వస్తే చేస్తానా లేదా అనేది నా డౌటు.

ఎందుకంటే ఆయన సినిమాలో విలన్ గా నటించాలి అంటే తన కళ్ళలోకి చూస్తూ డైలాగులు చెప్పాల్సి ఉంటుంది.

చిరంజీవి గారిని ఎదురుగా చూడాలంటేనే కింద మీద అవుతుంది అలాంటిది ఆయన ముందు ఏం నటిస్తాను.ఇక విలన్ గా ఆయన మీదకు వెళ్లడం అనే ఆలోచన వస్తేనే ఎంతో టెన్షన్ గా ఉంటుంది అంటూ ఇంటర్వ్యూ సందర్భంగా హీరో కార్తికేయ తెలియజేశారు.అయితే ఎప్పటికైనా ఆయన సినిమాలో ఒక చిన్న పాత్రలోనైనా నటించాలనే కోరిక ఉందని నా అభిమాన హీరోతో కలిసి మంచి సినిమా చేశానని సంతృప్తి నాలో ఉండిపోవాలని అలాంటి అవకాశం కోసమే తాను ఎదురు చూస్తున్నానని తెలిపారు.

ఇక అజిత్, కార్తికేయ నటించిన వలిమై చిత్రం ఈనెల 24వ తేదీన విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube