ప్ర‌జ‌ల్లో వైసీపీపై వ్య‌తిరేక‌త పెరిగింది.. గ‌ట్టిగా పోరాడాలి ! బాబు కామెంట్స్‌

ఏపీ వైసీపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో ప్ర‌జ‌ల్లో కాస్త నెగెటివ్ టాక్ వ‌స్తోంది.ప‌రిపాల‌నా తీరు ప‌క్క‌న‌బెడితే ఆర్థికంగా బ‌ల‌హీనంగా రాష్ట్రం ప‌ట్ల జ‌గ‌న్ తీరు స‌రిగా లేద‌ని ప్ర‌తిప‌క్షాలు, మీడియా సైతం విమ‌ర్శిస్తున్న ప‌రిస్థ‌తిని చూస్తున్నాం.

 The Opposite To Ycp Has Increased In People Fight Hard! Babu Comments‌, Chan-TeluguStop.com

ఒక్క సంక్షేమం తప్ప మిగిలిన వాటిని ప‌ట్టించుకోవ‌ట్లేద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.అయితే ఏమాత్రం అవ‌కాశం దొరికినా ప్ర‌తిప‌క్ష పార్టీగా ఉన్న టీడీపీ విరుచుకు ప‌డ‌డం మ‌న‌కు తెలిసిందే.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు పార్టీ నేత‌ల‌తో ఏర్పాటు చేసిన స‌మావేశంలో చేసిన వ్యాఖ్య‌లు అంద‌రినీ ఆలోచ‌న‌లో ప‌డేస్తున్నాయి.

ప్ర‌జ‌ల‌కు న్యాయం చేసేందుకు గ‌ట్టిగా పోరాడాల‌ని దిశానిర్ధేశం చేశాడు.

అధికార పార్టీ నేత‌ల అవినీతిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త నెల‌కొంద‌ని, జ‌గ‌న్ స్వార్థ‌పూరిత రాజ‌కీయాల‌తో రాష్ట్రం తీవ్రంగా న‌ష్ట‌పోతోంద‌ని పోరాటాలు చేయాల‌ని అన్నారు.ప్ర‌జ‌లు రెండున్న‌రేండ్లుగా అనేక క‌ష్టాలు ఎదుర్కొంటున్నార‌ని, ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌ని అన్నారు.

వచ్చే ఎన్నిక‌ల్లో టీడీపీని అధికారంలోకి తేవాల‌ని పిలుపునిచ్చారు.ఆ దిశ‌గా టీడీపీ త‌మ్ముళ్లు అడుగులు వేయాల‌ని సూచించారు.175 నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జీలు, 25పార్ల‌మెంట్ స్థానాల ఇన్‌చార్జీలతోఆన్‌లైన్ స‌మావేశం నిర్వ‌హించి పనిచేయని నేతలను ఉపేక్షించనని హెచ్చరించారు.

ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు ఇచ్చిన ఒక్క అవ‌కాశాన్ని చివ‌రి అవ‌కాశంగా మ‌లుచు కున్నాడ‌ని విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం.వైసీపీ నేత‌ల రౌడీయిజం,సెటిల్‌మెంట్ల‌పై రాజీలేని పోరాటాలు చేయాల‌ని టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపు కూడా ఇచ్చారు.ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు నాయ‌కులు అండ‌గా నిల‌వాల‌ని సూచించారు.

త్వ‌ర‌లోనే ఆన్‌లైన్ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తామ‌ని తెలిపారు.టీడీపీ 40 ఏండ్ల ఆవిర్భావ వేడుక‌లు, ఎన్టీఆర్ శ‌త జ‌యంతి మ‌హానాడుకు అధిక ప్రాధాన్యం ఉంటుంద‌ని వెల్ల‌డించారు.

వేడుక‌ల‌ను అట్ట‌హాసంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.అయితే త‌ల్లికి, చెల్లికి న్యాయం చేయ‌లేని సీఎం జ‌గ‌న్ రాష్ట్రానికి చేమి చేస్తాడ‌ని, జ‌గ‌న్ వ‌ద్ద డ‌బ్బు, అధికారం ఉంటే.

త‌మ‌కు ప్ర‌జాబ‌లం ఉంద‌ని ఉపోద్ఘాటించారు.చెల్లికి న్యాయం చెయ్యలేని సీఎం.

రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని నిలదీశారు.దీనిని బ‌ట్టి చూస్తే వ‌చ్చే 2024 ఎన్నిక‌ల నాటికి వైసీపీ వ్య‌తిరేక‌త‌ను క్యాచ్ చేసుకుని ప‌వ‌ర్ ద‌క్కించుకోవాల‌నే ప్లాన్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube