మధురమైన గాత్రం.. ఊరికి బస్సు తెప్పించిన సరిగమపలో ఒక్క పాట.. సింగర్ పార్వతి గురించి ఎవరికి తెలియని నిజాలు!

సింగర్ పార్వతి ఈ పేరు గురించి చాలా మందికి తెలియక పోవచ్చు కానీ, ఊరంతా వెన్నెల పాట పాడిన పార్వతి అనగానే ఇట్టే గుర్తు పట్టేస్తారు.ఒక్క పాటతో పార్వతి బాగా పాపులర్ అయ్యింది.

 Saregamapa Singer Parvathy Wish Fulfilled Rtc Bus , Singer Parvathi , Rtc Bus ,-TeluguStop.com

పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు అన్న దానికి మరొక ఉదాహరణగా నిలిచింది సింగర్ పార్వతి.సాధారణంగా అందం కంటే మంచి మనసు ముఖ్యం అని అంటూ ఉంటారు.

కొంత మంది అందాన్ని గుర్తిస్తే,ఇంకొంత మంది ప్రతిభను గుర్తిస్తూ ఉంటారు.అలాంటి ప్రతిభకు మంచి మనసు తోడైతే ఎదురే ఉండదు.

అలా తాజాగా సరిగమప కొత్త సీజన్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది పార్వతి.

ఆమె పాడిన పాటను విని అందరూ పరవశించి పోయారు.

రంగ్ దే సినిమాలోని ఊరంతా వెన్నెల అనే పాటను పార్వతి పాడింది.పార్వతి పాటను విన్న జడ్జ్ లు ప్రశంసల వర్షం కురిపించారు.

పార్వతి ని పొగుడుతూ సింగర్ అనంత్ శ్రీరామ్ పాపను కనలేదు పాటను అన్నారు అంటూ ప్రశంసలు కురిపించారు.ఈ క్రమంలోనే నీకు ఏమి కావాలో కోరుకో అని మ్యూజిక్ డైరెక్టర్ కోటి పార్వతిని అడగగా.

నాకేం వద్దు సార్ మా ఊరికి బస్సు వేస్తే చాలు అని సింగర్ పార్వతి తన మంచితనాన్ని ప్రదర్శించింది.నువ్వు ఈ పాటను పాడినప్పుడే బస్సు వచ్చింది అని జెడ్జ్ శైలజ చెప్పుకొచ్చింది.

పార్వతి కోరికను విన్న అభిమానులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.

ఆమె కోరికను అధికారులకు తెలిసేలా షేర్ చేశారు.వెంటనే స్పందించిన ఏపీఎస్ఆర్టీసి అధికారులు స్పందించి వెంటనే ఆ ఊరికి ఒక బస్సును ఏర్పాటు చేశారు.డోన్ డిపో నుంచి లక్కసాగరం గ్రామానికి ఉదయం 7:30 కి అలాగే సాయంత్రం 6:30 కి బస్సు సర్వీసులను నడుపుతోంది ప్రకటించాడు.ఇక ఆర్టీసీ అధికారులు ప్రకటించిన విధంగానే తాజాగా ఆ గ్రామానికి బస్సు సర్వీసులు అందుబాటు లోకి వచ్చింది.అంతే కాకుండా సింగర్ స్మిత ఆధ్వర్యంలో గ్రామస్తులు పార్వతిని ఘనంగా సన్మానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube