ఆహా ఇండియన్ ఐడల్‌.. రేవంత్‌, శ్రీరామచంద్ర ఇద్దరు ఏమై పోయారు బాబు?

దేశ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించిన సింగింగ్ రియాల్టీ షో ఇండియన్ ఐడల్ అనడం లో ఎలాంటి సందేహం లేదు.ఇప్పుడు ఇండియన్ ఐడల్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 Telugu Indian Idol Anchor Not Sree Rama Chandra Details, Telugu Indian Idol, Aha-TeluguStop.com

ఇప్పటికే ఆహా ఓటీటీ వారు ఈ సింగింగ్ రియాల్టీ షో ను ప్లాన్ చేశారు.గత రెండు నెలలు గా ఆడిషన్స్ కూడా నిర్వహించారు.

ఆడిషన్స్ పూర్తి చేసుకుని షో స్ట్రీమింగ్ కి సిద్ధం అయింది.ఈ నెల 25 వ తారీకు నుండి స్ట్రీమింగ్‌ అవ్వబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఈ షో కు యాంకర్ గా శ్రీరామ చంద్ర వ్యవహరించబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.అంతకు ముందు ఇండియన్ ఐడల్ విజేత రేవంత్ ఈ షో కు యాంకర్ గా వ్యవహరిస్తాడు అనే ప్రచారం కూడా జరిగింది.

కానీ ఇప్పుడు వీరిద్దరు కూడా కనిపించడం లేదు.

కేవలం తమన్ మరియు నిత్యామీనన్ లు మాత్రమే ప్రమోషన్ వీడియో లో సందడి చేస్తున్నారు.

శ్రీ రామచంద్ర దగ్గరుండి మరి ఆడిషన్స్ నిర్వహించాడు అంటూ వార్తలు వచ్చాయి.కానీ ఇప్పుడు ఆయన ఈ షో లో కనిపించడం లేదు అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ షో విషయం లో ముందు నుండి కూడా ఒక విషయమై క్లారిటీ లేదు.యాంకర్లు గా పలువురి పేర్లు మారుతూనే ఉన్నాయి.

రేవంత్ మరియు శ్రీరామ చంద్ర లు మారడం పట్ల అభిమానులు అసంతృప్తి తో ఉన్నారు.ఇప్పుడు ఎవరు వస్తారు అనేది చూడాలి.ఒకవేళ యాంకర్ గా ప్రదీప్‌ వచ్చినట్లయితే కచ్చితంగా సక్సెస్ అవుతుంది.కానీ ఆయన కాకుండా మరెవరు వచ్చినా కూడా పెద్దగా ఆదరణ పొందే అవకాశాలు లేవు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు ఇండియన్ ఐడల్‌ ఆహా ఓటీటీ షో ద్వారా ఎంతో మంది కొత్త గాయనీ గాయకులు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వాలని కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube