జగన్ 'అవసరాన్ని ' బీజేపీ గుర్తించినట్టే ? ఇక సహకారమే ?

ఏపీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై చాలా కాలంగా సీఎం జగన్ కు అసంతృప్తి ఉంది.జగన్ కే  కాదు, రాష్ట్ర ప్రజలకూ ఈ విషయంలో అసంతృప్తి ఉంది.

 The Central Government Has Decided To Co Operate With The Ap Government In All P-TeluguStop.com

కేంద్రం కావాలనే కక్షగట్టి ఏపీ కి అందాల్సిన నిధులను విడుదల చేయకుండా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని, న్యాయంగా రావాల్సిన నిధులు విడుదల చేయకుండా ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.మొదట్లో జగన్ ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకారం అందించింది.

కానీ గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం ను టార్గెట్ చేసుకుంటూ బీజేపీ నాయకులు విమర్శలు చేస్తూ వస్తున్నారు.పోలవరం ప్రాజెక్టు తో పాటు,  వివిధ  పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి నిధుల విడుదలలో రాజకీయం చేస్తున్న జగన్ మాత్రం బీజేపీ  ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడం లేదు.

కేవలం ఢిల్లీకి వెళ్లి వినతి పత్రాలు సమర్పిస్తూ,  ఏపీ విషయంలో సానుకూలంగా స్పందించాలని కేంద్ర బీజేపీ పెద్దలను పదేపదే కోరుతూ వస్తున్నారు.ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా బీజేపీ కి ఎదురుగాలి వీస్తోంది.

వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓటమి చెందింది.దీనికితోడు దేశవ్యాప్తంగా నిర్వహించిన అన్ని సర్వే రిపోర్టులు బీజేపీని భయపెడుతున్నాయి .దీంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఇప్పుడు ఏకం అవ్వడం,  ప్రత్యేకంగా కూటమి కడుతూ ఉండడం ఇవన్నీ బీజేపీని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ప్రాంతీయ పార్టీల కూటమిని బలోపేతం చేసే పనిలో ఆయన ఉన్నారు.కానీ జగన్ మాత్రం తమ కారణంగా నష్టపోతున్న బీజేపీని పల్లెత్తు మాట అనకపోవడం,  రాబోయే రోజుల్లో జగన్ సహకారం తప్పనిసరిగా అవసరం అవుతుంది అనే అంచనాతో  బీజేపీ పెద్దలు ఉన్నారట.దీంతో మార్చి పదో తేదీ తర్వాత నుంచి పూర్తిగా ఏపీకి అన్ని విషయాలలోను సహకరించాలని , నిధులను విడుదల చేయడంతో పాటు , పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అయ్యేవిధంగా సహకరించి జగన్ మద్దతు పొందాలని బిజెపి వ్యూహాలు పన్నుతోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube