మోహన్ బాబును ట్రోల్ చేస్తున్న ఆ ఇద్దరు హీరోలు ఎవరు?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన తాజా సినిమా సన్ ఆఫ్ ఇండియా. ఈ సినిమాలో మోహన్ బాబు కీ రోల్ చేస్తున్నాడు.

 Heros Who Are Trolling Mohan Babu Details, Actor Mohan Babu, Mohan Babu, Manchu-TeluguStop.com

డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈ నెల 18న ఈ సినిమా రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా పలు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి.

అందులో భాగంగా తాజాగా మోహన్ బాబు మీడియాతో మాట్లాడాడు.ఈ సందర్భంగా ఇద్దరు హీరోలపై ఆయన విరుచుకుపడ్డాడు.

ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా మంచు విష్ణు, మోహన్ బాబు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

వాటిపై జనాలు ఓ రేంజిలో కామెంట్స్ చేశారు.పలు రకాల మీమ్స్ కూడా వచ్చాయి.

తాజాగా వీటిపై మోహన్ బాబు స్పందించాడు.అయితే మీమ్స్ అనేవి ఎదుటి వారు నవ్వుకునేలా ఉండాలి తప్ప.

హేళన చేసేలా.ఇబ్బంది పెట్టేలా ఉండ కూడదు అని చెప్పాడు.

సాధారణంగా తను మీమ్స్ ను పట్టించుకోను అన్నాడు.ఎవరైనా తనకు పంపితే చూస్తాను అన్నాడు.

అయితే ఇటీవల మీమ్స్ హద్దు మీరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు.అలాంటి వాటిని చూసినప్పుడు తనకు బాధ కలుగుతుందని చెప్పాడు.

ఎదుటి వారిని ప్రశ్నించడంలో తప్పులేదు.కానీ హద్దులు మీరి సదరు వ్యక్తులు బాధపడేలా మాత్రం ఆ వ్యంగ్యం ఉండకూడదని చెప్పాడు.

అలా చేయడం నిజంగా బాధాకరం అన్నాడు.

అటు ఇండస్ట్రీలో ఓ ఇద్దరు హీరోలు నన్ను ట్రోల్ చేస్తున్నారని చెప్పాడు.అయితే వాళ్లు డైరెక్ట్ గా కాకుండా.ఓ 50 మంది నుంచి 100 మందిని ట్రోల్ చేయడానికి నియమించుకున్నట్లు చెప్పాడు.

వాళ్లు ఎవరో కూడా తనకు తెలుసు అని చెప్పాడు.వారికి ఇప్పుడు బాగానే ఉంటుంది.

కానీ.ఏదో ఒక రోజు తగిన మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు.

ఆ రోజు వారికి ఎవరూ సహకరించరని వెల్లడించాడు.అయితే ఆ ఇద్దరు హీరోలు ఎవరు? అనేది మాత్రం మోహన్ బాబు బయటకు చెప్పలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube