ప్రెగ్నెన్సీ టైమ్‌లో నిద్ర ప‌ట్ట‌డం లేదా? అయితే ఇవే కార‌ణం కావొచ్చు!

రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోవ‌డం.గ‌ర్భిణీలు ఫేస్ చేసే కామ‌న్‌ స‌మ‌స్య ఇది.

 These Are The Reasons Not Be Able To Sleep During Pregnancy! Pregnancy, Latest N-TeluguStop.com

ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో నిద్ర ఎంతో అవ‌స‌రం.రోజుకు ఖ‌చ్చితంగా ఎనిమిది గంట‌ల పాటు నిద్రించాలి.

కంటి నిండా నిద్ర ఉంటేనే నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.కానీ, చాలా మందికి ప్రెగ్నెన్సీ టైమ్‌లో నిద్ర ప‌ట్ట‌నే ప‌ట్ట‌దు.

ఎంత‌ బ‌లవంతంగా ప‌డుకుందామ‌ని ప్ర‌య‌త్నించినా సాధ్యం కాదు.అయితే గ‌ర్భిణీల‌కు నిద్ర ప‌ట్ట‌క‌పోవ‌డానికి కొన్ని కార‌ణాలు ఉన్నాయి.

అవేంటో తెలుసుకుని వాటిని స‌రి చేసుకుంటే.ప్ర‌శాంత‌గా నిద్ర పోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు లేటు ప్రెగ్నెన్సీ టైమ్‌లో నిద్ర ప‌ట్ట‌క‌పోవ‌డానికి కార‌ణాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

గ‌ర్భిణీలు తెలుసో, తెలియ‌కో చేసే పొర‌పాటు ప‌గ‌టి పూట నిద్రించ‌డం.

ముఖ్యంగా మధ్యాహ్నం భోజ‌నం చేశాక మూడు నుంచి నాలుగు గంట‌ల పాటు ప‌డుకుంటారు.రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క పోవ‌డానికి ఇదో కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు.

అందుకే ప‌గ‌టిపూట నిద్రించ‌రాదు.ఒక‌వేళ బాగా నిద్ర వ‌స్తే గ‌నుక ఓ ఇర‌వై, ముప్పై నిమిషాలు మాత్ర‌మే రెస్ట్ తీసుకోవాలి.

అలాగే మసాలా వంట‌లు ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా స‌రిగ్గా నిద్ర ప‌ట్ట‌దు.కాబ‌ట్టి, ప్రెగ్నెన్సీ టైమ్‌లో మ‌సాలా వంట‌ల‌ను ఎంత త‌క్కువ‌గా తీసుకుంటే అంత మంచిద‌ని అంటున్నారు.గ‌ర్భిణీల్లో చాలా మంది క్రేవింగ్స్ కార‌ణంగా కాఫీ, టీ, డార్క్ చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటిని ఎక్కువ‌గా తీసుకుంటారు.అయితే అందులో ఉండే కెఫిన్ నిద్రను దెబ్బ తీస్తుంది.

అంద వ‌ల్ల‌, అటువంటి ఫుడ్స్‌కు దూరంగా ఉండ‌ట‌మే మంచిది.

ఇక గ‌ర్భిణీలు అన‌వ‌స‌ర‌మైన విష‌యాల‌ను ఆలోచిస్తూ భ‌యాన్ని పెంచుకుంటారు.

దాంతో ఒత్తిడి పెరుగుతుంది.ఫ‌లితంగా నిద్ర ప‌ట్ట‌దు.

కాబ‌ట్టి, గ‌ర్భిణీలు ప‌నికిరాని విష‌యాల‌ను ఆలోచించ‌డం మానేసి.ఒత్తిడిని త‌గ్గించుకోవాలి.

అప్పుడే హాయిగా నిద్ర ప‌డుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube