కర్నూలు జిల్లా(ఆళ్లగడ్డ): మాజీ మంత్రివర్యులు, శ్రీమతి భూమా అఖిల ప్రియ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.ఆళ్ళగడ్డలో రోడ్ వైడ్నింగ్ పేరుతో ప్రజలను వై.
సి.పి నాయకులు లూటీ చేస్తున్నారు.ప్రజలకు నష్టపరిహారం చెల్లించకుండా కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచేస్తున్నారు.ఎమ్మెల్యే రోడ్ వైడ్నింగ్ పనులకు సంబందించి డబ్బు తీసుకోవడం గురించి కలెక్టర్ దగ్గర ఎంక్వైరీకి రావాలి.
అవినీతి జరిగిందని నిజం నిరూపించకపోతే నేను రాజకీయలకు రాజీనామా చేసే ధైర్యం నాకు ఉంది.నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేసే దమ్ము నీకుందా?
రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేపర్ మీద సంతకం పెట్టి కలెక్టర్ కు ఇస్తా నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు అవినీతికి పాల్పడలేదనే ధైర్యం నీకు ఉంటే రాజీనామా పత్రం తీసుకుని కలెక్టర్ ముందుకు వచ్చే ధైర్యం వుందా? రెండు రోజులలో కలెక్టర్ ని కలిసి ధర్నా చేస్తాం.
ఆళ్ళగడ్డలో ఎప్పుడూ లేనివిధంగా నీచమైన డబ్బు రాజకీయాన్ని పరిచయం చేస్తున్నారు.ప్రభుత్వానికి మేము దానం చేసిన స్థలంలో కట్టిన స్టేడియానికి మా అబ్బ పేరు పెట్టుకోవడం జరిగింది.
ప్రజా ధనంతో మునిసిపల్ స్థలంలో కట్టిన కార్యాలయానికి మీ అబ్బ పేరు పెట్టుకోవడం సిగ్గుచేటు.