మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.కానీ ఇప్పుడు అల్లు అర్జున్ బంధువులు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అనే స్థాయికి ఎదిగాడు.
ప్రస్తుతం పుష్ప సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయాడు.
అయితే బన్నీ కెరీర్ ఆరంభంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు.వాటన్నింటినీ ఎదుర్కొంటూ దేశం గర్వించే హీరోగా మారాడు బన్నీ.
అల్లు అర్జున్ తొలి సినిమా గంగోత్రి వచ్చినప్పుడు అసలు ఇతడు హీరో ఎలా అయ్యాడు? అనే విమర్శలు వచ్చాయి.అతడి బాడీ షేమింగ్ మీద కూడా రకరకాల కామెంట్స్ వచ్చాయి.
అయితే తనను తాను ఫ్రూవ్ చేసుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు. డ్యాన్స్, యాక్టింగ్ లో ఫర్ఫెక్ట్ అనిపించుకునేందుకు రోజుల తరబడి శ్రమించాడు.
అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.బన్నీ రెండేళ్ల వయసులోనే చిరంజీవి మూవీలో నటించాడు.
తనకు 10 ఏండ్లు వచ్చాక.చిరంజీవిని అనుసరిస్తూ డ్యాన్సులు చేశాడు.
తొలి సినిమా తర్వాత లుక్ పరంగా బాగా ఎదగాలని భావించాడు.ఆ తర్వాత వచ్చిన ఆర్య మూవీలో డిఫరెంట్ లుక్ లో కనిపించాడు అల్లు అర్జున్.ఈ సినిమాతో జనాలను బాగా ఆకట్టుకున్నాడు.ఈ సినిమా తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమాలో లుక్ పరంగా ఎంతో డెవల్ అయ్యాడు.దేశ ముదురు సినిమాలో ఏకంగా సిక్స్ ఫ్యాక్ తో అలరించాడు.
యూత్ ను బాగా ఆకట్టుకున్నాడు అయితే చాలా సినిమాలు చేసినా.స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు.
కాగా జులాయితో త్రివిక్రమ్ ఆలోటును తీర్చాడు.ఈ మూవీ బన్నీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను సాధించింది.రూ.40 కోట్లు వసూళు చేసింది.ఈ సినిమా తర్వాత రేసుగుర్రం రూ.50 కోట్లు వసూళు చేసింది.ఈ సినిమా తర్వాత వచ్చిన s/o సత్యమూర్తి కూడా రూ.50 కోట్ల క్లబ్ లో చేరింది.
ఆ తర్వాత వచ్చిన సరైనోడు మూవీతో ఆ లోటును పూడ్చాడు.ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లు వసూళు చేసింది.ఆ తర్వాత వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా నాన్ బాహుబలి రికార్డలను బద్దలుకొట్టింది.దాదాపు రూ.200 కోట్లు వసూలు చేసింది.తాజాగా వచ్చిన పుష్ప సినిమా బన్నీని పాన్ ఇండియన్ స్టార్ గా నిలబెట్టింది.ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు.