హెయిర్ ఫాల్‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారా.? ఎన్ని షాంపూలు, హెయిర్ ఆయిల్స్ మార్చినా ఫలితం ఉండటం లేదా.? రకరకాల హెయిర్ ప్యాకులు వేసుకున్నా జుట్టు రాలడం తగ్గట్లేదా.? అయితే ఇకపై చింతించకండి.ఎందుకంటే, బ్రౌన్ రైస్‌తో చాలా సులభంగా మరియు వేగంగా హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.సాధారణంగా బ్రౌన్ రైస్ బరువును తగ్గించడంలోనూ, గుండె జబ్బులు రాకుండా రక్షించడంలోనూ, బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపు చేయడంలోనూ అద్భుతంగా సహాయపడుతుంది.
అలాగే జుట్టు సంరక్షణకు సైతం బ్రౌన్ రైస్‌ను ఉపయోగించవచ్చు.ముఖ్యంగా ఇందులో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టడంలో సూపర్‌గా హెల్ప్ చేస్తాయి.
మరి ఇంకెందుకు లేటు బ్రౌన్ రైస్‌ను జుట్టుకు ఎలా ఉపయోగించాలో ఓ చూపు చూసేయండి.ముందుగా కప్పు బ్రౌన్ రైస్‌ను వండుకుని బాగా చల్లారబెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వండి చల్లారబెట్టుకున్న బ్రౌన్ రైస్, కొద్దిగా వాటర్ వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి.ఆ తర్వాత ఈ పేస్ట్‌లో రెండు టేబుల్ స్పూన్ల పుల్లటి పెరుగు, వన్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.
రెండు గంటలు అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.
ఇలా వారంలో ఒక్క సారి చేశారంటే హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా తగ్గిపోయి.జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడం ప్రారంభం అవుతుంది.కాబట్టి, హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అవుతున్న వారు ఖచ్చితంగా ఈ బ్రౌన్ రైస్ హెయిర్ ప్యాక్‌ను ట్రై చేయండి.అయితే ఈ ప్యాక్ వేసుకునే ముందు జుట్టుకు ఆయిల్ లేకుండా చూసుకోవాలి.