స్టూడెంట్స్‌కి టెక్ దిగ్గజం గూగుల్ తీపి కబురు అందించింది.పీరియాడిక్ టేబుల్ గుర్తుపెట్టుకోవడంలో లేదా నేర్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల కోసం ఒక కొత్త ఫెసిలిటీని గూగుల్ ప్రవేశపెట్టింది.
ఆసక్తిగల విద్యార్థులు గూగుల్ వెబ్ సైట్ లో ఇంగ్లీష్ లో పీరియాడిక్ టేబుల్ (Periodic Table) అని సెర్చ్ చేస్తే చాలు.వెంటనే పీరియాడిక్ టేబుల్ ఆకర్షణీయమైన రంగుల్లో డిస్‌ప్లే అవుతుంది.
అంతే కాదు ప్రతి ఎలిమెంట్ గ్రాఫికల్ ప్రజెంటేషన్ లో డిస్‌ప్లే అవుతుంది.ఈ టేబుల్ లోని ఎలిమెంట్స్ పై క్లిక్ చేసి వాటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
ఈ విధంగా మీరు ఒక్కొక్క ఎలిమెంట్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకొని మొత్తం పీరియాడిక్ టేబుల్ గుర్తు పెట్టుకోవచ్చు.ఈ ఇంటెరాక్టివ్ టేబుల్ ను కంప్యూటర్లతో సహా మొబైళ్లలో డెస్క్ టాప్ వెర్షన్ (desktop version)లోనూ వీక్షించడం వీలవుతుంది.
ఈ ఇంటెరాక్టివ్ పీరియాడిక్ టేబుల్‌ను రెండు రోజుల క్రితమే విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది గూగుల్. ఫిబ్రవరి 7వ తేదీన పీరియాడిక్ టేబుల్ డే సందర్భంగా దీన్ని తీసుకొచ్చినట్లు గూగుల్ వెల్లడించింది.” నేడు పీరియాడిక్ డే అనే విషయం మీ అందరికీ తెలిసిందే.ఈ సందర్భంగా మేం మీకోసం ఒక సరికొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చాం.
ఈ సదుపాయంతో మీరు మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో Periodic table అని టైప్ చేసి.ఇంటెరాక్టివ్ ఎలిమెంట్స్‌ను వీక్షించవచ్చు.” అని గూగుల్ ట్విట్టర్ వేదికగా తెలిపింది.
విద్యార్థులు అలాగే పీరియాడిక్ టేబుల్ నేర్చుకోవాలనుకునే తపన ఉన్న వారందరూ గూగుల్ తీసుకొచ్చిన టేబుల్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు.ఇకపోతే కెమికల్ ఎలిమెంట్స్ పరమాణు సంఖ్య ప్రకారం ఆరోహణ క్రమంలో పీరియాడిక్ టేబుల్ సృష్టించడం జరిగింది.అయితే ఒక్కొక్క ఎలిమెంట్ లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? వాటి రంగు ఏంటి? మాస్ ఎంత? బాయిలింగ్ పాయింట్? ఎప్పుడు కనుగొన్నారు? వంటి కీలక వివరాలను మీరు గూగుల్ తెచ్చిన ఈ ఇంటెరాక్టివ్ పీరియాడిక్ టేబుల్ సాయంతో తెలుసుకోవచ్చు.ఇందుకు మీరు ఒక్కో మూలకంపై నొక్కితే సమాచారం అంతా మీ ముందు ఉంటుంది.