తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షాల, అధికార పక్షం మధ్య మాటల తూటాలతో అనధికారికంగా ఎన్నికల వాతావరణం నెలకొంది.గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.
అయితే ప్రస్తుతం చాలా వరకు కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య పెద్ద ఎత్తున రెండో ప్రత్యామ్నాయ స్థానం కొరకు పోటీ పడుతున్న పరిస్థితిలలో ఇప్పటికే బీజేపీ తనదైన శైలిలో వ్యూహాలు రచించుకుంటూ టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతోంది.అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే రకరకాల అంశాలపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
ఇప్పటికే రేవంత్ రెడ్డి సీనియర్ నేతలు సహకరించకపోయినా తనదైన రీతిలో వ్యూహాలు రచిస్తూ కాంగ్రెస్ ను ఇటు క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ ఎంతలా బలోపేతంగా ఉండేదో అచ్చం అలా ఉండేలా రేవంత్ చాలా బలమైన నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.
అయితే గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట.
అయితే ఇదే ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానాన్ని కలవరపాటుకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే గతంలో ఎంపీలుగా పోటీ చేసిన నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారని కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున జోరుగా చర్చ నడుస్తోంది.
అయితే ఇంకా అధికారికంగా కాంగ్రెస్ నాయకులు ఎవరూ కూడా ఈ విషయంపై బయటికి స్పందించకపోయినా చాలా హాట్ హాట్ చర్చ అనేది మాత్రం జరుగుతున్నది మాట సుస్పష్టం.మరి రానున్న రోజులలో ఈ విషయం ఎన్ని మలుపులు తిరుగుతుందనేది చూడాల్సి ఉంది.