బీజేపీ ' బండి ' కి బ్రహ్మాస్త్రాలు అందించిన కేసీఆర్ ? 

తెలంగాణలో బిజెపి బలం పెంచుకునేందుకు, 2023 ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.అందివచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా  ఉపయోగించుకుంటూ, బీజేపీని బలోపేతం చేస్తూ, అధిష్టానం వద్ద మంచి మార్కులు  సంపాదించేందుకు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు.

 Kcr Is Giving Bjp A Chance To Strengthen In Telangana, Telangana Bjp President,-TeluguStop.com

తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఏం చేయాలి అన్న విషయంపై పూర్తిగా దృష్టి పెట్టారు.ఇటీవల జరిగిన దుబ్బాక , హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంతో,  ఆ పార్టీలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది.

  అధిష్టానం వద్ద పలుకుబడి బాగా పెరిగింది.  అంతేకాకుండా బండి సంజయ్ ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన వ్యవహారంలో దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కీలక నాయకులు,  వివిధ రాష్ట్రాలలో బిజెపి ముఖ్యమంత్రులు హైదరాబాద్ వచ్చి మరి పలకరించారు.
  ఈ విధంగా రాజకీయంగా బలపడేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా దానిని సంజయ్ సమర్థవంతంగా వాడుకుంటున్నారు.ఇక తెలంగాణలో బిజెపికి దూరంగా ఉంటూ వస్తున్న దళిత సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.

దీనికోసం ప్రత్యేకంగా దృష్టి సారించింది.సరిగ్గా ఇదే సమయంలో భారత రాజ్యాంగం ను మార్చాలంటూ కేసిఆర్ కామెంట్ చేయడాన్ని బిజెపి అవకాశం గా తీసుకుంది.

రాజ్యాంగాన్ని కేసీఆర్ మార్చాలంటూ మాట్లాడడం అంబేద్కర్ ను అవమానించడమే అని బండి సంజయ్ భీమ్ దీక్షలు చేపట్టారు.ఈ భీమ్ దీక్షల ద్వారా పూర్తిగా దళిత సామాజిక వర్గానికి దగ్గరై రాబోయే ఎన్నికల్లో సునాయాసంగా బీజేపీ ని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా సంజయ్ ప్లాన్ చేస్తున్నారు.
 

 ఇదే కాదు ఇకపై కేసీఆర్ ఏ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా,  ఇంతే స్థాయిలో వివాదాస్పదం చేసేందుకు సంజయ్ ఆధ్వర్యంలోని బీజేపీ ప్లాన్ చేసుకుంటోంది.బీజేపీ తెలంగాణ లో బలపడేందుకు, బండి సంజయ్ గ్రాఫ్ పెరిగేందుకు పరోక్షంగా కేసీఆర్ అవకాశం కల్పిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Kcr Is Giving Bjp A Chance To Strengthen In Telangana, Telangana BJP President, Bandi Sanjay, Telangana CM, Dubbaka, Hujurabad Elections, - Telugu Bandi Sanjay, Dubbaka, Hujurabad, Telangana Bjp, Telangana Cm

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube