ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీరుని ఖండిస్తూ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించడం తెలిసిందే.ఈ సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి.
ప్రధాని మోడీ ని ఉద్దేశించి అదే విధంగా బీజేపీ పార్టీ నాయకులను గట్టిగా టార్గెట్ చేసి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.బడ్జెట్ లో తెలంగాణా పట్ల కేంద్రం వివక్షత చూపిందని.
ఫుల్ సీరియస్ అయ్యారు.ఈ తరుణంలో కేసీఆర్ మాట్లాడిన భాష పై తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
మోడీని ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం హర్షించదనీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.అదే రీతిలో అంత దారుణమైన భాషతో మోడీని విమర్శిస్తే బీజేపీ నాయకులు ఇప్పటివరకు రియాక్ట్ కాకపోవటం తనకు అర్థం కావడం లేదని తెలిపారు.
అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల తెలంగాణకు ఎటువంటి మేలు జరగలేదని తనదైన శైలిలో సీరియస్ అయ్యారు.కేసీఆర్ పత్రికా సమావేశం ద్వారా మర్యాద మర్చిపోయారు.
ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే దేశానికి గాని తెలంగాణ రాష్ట్రానికి గాని మేలు చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని.అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.