మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి డైరక్షన్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.
సినిమాలో గోపీచంద్ కి జోడీగా రాశి ఖన్నా నటించింది.సినిమా నుండి వచ్చిన టీజర్ అంచనాలు పెంచగా గోపీచంద్ ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు.
ఇక కొన్నాళ్లుగా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్న చిత్రయూనిట్ పక్కా కమర్షియల్ రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు తెలుస్తుంది.
సినిమాను మే 20న రిలీజ్ చేయాలని నిర్ణయించారు.ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యాం సినిమాల రిలీజ్ డేట్ లు మారడంతో మిగతా సినిమాల రిలీజ్ డేట్లు మారాయి.ఫిబ్రవరి 25 నుండి వరుస స్టార్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. 12న సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట రిలీజ్ ఎనౌన్స్మే
జాలీ ఎల్.ఎల్.బి 2 రీమేక్ గా వస్తున్న పక్కా కమర్షియల్ సినిమాతో కెరియర్ లో మంచి సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు గోపీచంద్.