నందిగామ పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ లు పలు శంకుస్థాపనలు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు గాంధీ వర్ధంతి రోజున నందిగామ పట్టణంలో గల గాంధీ బొమ్మ స్థానంలో మరో కొత్త గాంధీ కాంస్య విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గాంధీ విగ్రహం గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన విగ్రహం నందిగామలో ఏర్పాటు చేయడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు.
దేశ ప్రధాని మోడీ విగ్రహం సైతం ఇదే తరహాలో ఏర్పాటు కు కర్ణాటక బిజెపి నాయకులు తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చారని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అన్నారు.
గాంధీజీ వర్ధంతి నాడు 25 అడుగుల గాంధీ విగ్రహానికి శంకుస్థాపన చేయడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే జగన్మోహన్ రావు అన్నారు.ఇదే విధంగా నందిగామ అభివృద్ధికి సహకరించిన ప్రజలకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కలెక్టర్లు ధన్యవాదాలు తెలియజేశారు
.