ఏపీలో వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని , మొదట్లో ఉన్నంత సానుకూలత అయితే ఇప్పుడు కనిపించడం లేదనే లెక్కల్లో తెలుగుదేశం పార్టీ ఉంటూ వచ్చింది .2024 ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని బలంగా నమ్మడమే కాకుండా, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు ఇదే విషయాన్ని బాబు నూరిపోస్తూ వస్తున్నారు.ఆ నమ్మకంతోనే తన వయసును కూడా లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపడుతూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ , ప్రజల్లోకి తీసుకు వెళ్లి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కి కనీసం 50 స్థానాలు కూడా దక్కవు అంటూ బాబు ముందుగానే జోస్యం చెబుతున్నారు.అయితే ఒక్కసారిగా బాబు అంచనాలను తలకిందులు చేస్తూ.
జాతీయ సర్వే ఒకటి బయటకు వచ్చింది.మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సీ ఓటర్ – ఇండియా టుడే సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోది, యూపీఏ తోపాటు ఇతర పార్టీలు ప్రభుత్వాలపై దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించారు.
దీనిలో భాగంగానే ఏపీలోనూ ఈ సంస్థ సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా జగన్ నిలవడంతో పాటు , ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ వైసీపీ కే అధికారం దక్కుతుందని, మెజారిటీ ఎంపీ స్థానాలు కూడా వైసీపీ ఖాతాలోనే పడతాయని ఆ సర్వే రిపోర్టుల్లో తేలింది.
అంతే కాదు కేంద్రంలో మళ్లీ ప్రధాని నరేంద్ర మోది నేతృత్వంలోని ఎన్.డి.ఎ అధికారంలోకి వస్తుందని ఈ సర్వేలో తేలింది.ఈ సర్వే రిజల్ట్ బయటకు రావడం తో టిడిపి తీవ్ర నిరాశా నిస్పృహల్లో కి వెళ్ళిపోయింది ఇప్పటివరకు వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని , తెలుగుదేశం తప్పకుండా అధికారంలోకి వస్తోంది అని చెబుతూ వచ్చినా, ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్ ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది.