అల్లు అర్జున్ డైట్ ప్లాన్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నేటి తరం కథానాయకులలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు.గంగోత్రి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్ తన ప్రతి ఒక్క సినిమాలోనూ ఎంతో జాగ్రత్తలు పాటిస్తూ సినిమా సినిమాకు తన లుక్ భిన్నంగా ఉండడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

 Icon Star Allu Arjun Diet Plan Details, Allu Arjun, Tollywood, Hero, Food Diet,-TeluguStop.com

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇదిలా ఉండగా పుష్ప సినిమాకు ముందు వరకు అల్లు అర్జున్ ని అందరూ స్టైలిష్ స్టార్ అని పిలిచేవారు.

ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా మారిపోయారు.

ఇక తాజాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాస్ లుక్ ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

దాదాపు రెండు సంవత్సరాల పాటు పుష్ప సినిమా షూటింగ్ జరిగింది.ఈ రెండు సంవత్సరాలు అల్లు అర్జున్ ఫిజిక్ లోఏ మాత్రం మార్పులు లేకుండా ఒకే రకమైన శరీర ఫిట్ నెస్ మెయింటెన్ చేయడం కోసం ఎంతో కష్టపడినట్లు తెలుస్తోంది.

ఇలా ఒకే రకమైన ఫిట్ నెస్ మెయింటెన్ చేయడం కోసం అల్లు అర్జున్ ఒక ప్రత్యేకమైన డైట్ ఫాలో అయ్యారని తెలుస్తోంది.మరి ఇలాంటి ఫిట్ నెస్ కోసం అల్లు అర్జున్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు.ఆయన డైట్ ప్లాన్ ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

అల్లు అర్జున్ తన ఫిట్ నెస్ కోసం అన్ని ఆహార పదార్థాలను సరైన మోతాదులో తీసుకుంటూ జున్ను వంటి పాల పదార్థాలను పూర్తిగా దూరం పెట్టారు.అలాగే తన ఆహారంలో సోడియం, కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువగా ఉండేలా డైట్ ప్లాన్ చేసుకునేవారు.ఇలా ప్రతిరోజూ ఉదయం అల్లు అర్జున్ నిద్రలేవగానే సుమారు ముప్పావు గంట పాటు ఎలాంటి వాటర్, జ్యూస్ తీసుకోకుండా త్రేడ్ మిల్ రన్నింగ్ చేసి అనంతరం ఒక కప్పు కాఫీ లేదా ఒక గ్లాస్ జ్యూస్ తాగుతారు.ఈయన బ్రేక్ ఈ విషయానికి వస్తే ప్రతి రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేస్తారు.ఇక అల్లు అర్జున్ బ్రేక్ ఫాస్ట్ విషయానికి వస్తే సుమారు నాలుగు గుడ్లతో ఆమ్లెట్ తయారు చేయించుకుని బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు.ఈ నాలుగు గుడ్లలో 3 గుడ్లు సోన లేకుండా, ఒక గుడ్డు సొనతో కలిపి తయారు చేస్తారు.

ఫ్రీ లంచ్ విషయానికొస్తే 11:30 నుంచి 12 లోపు సూప్, గ్రీన్ సలాడ్ తీసుకుంటారు.కొన్నిసార్లు ప్రొటీన్ల కోసం చికెన్ లేదా ఎగ్ తన ఫ్రీ లంచ్ లో భాగం చేసుకుంటారు.అదేవిధంగా లంచ్ విషయానికి వస్తే… ప్రతిరోజు ఒకటిన్నర నుంచి రెండు గంటల వ్యవధిలోపు పూర్తి చేస్తారు.మధ్యాహ్న భోజనంలో భాగంగా మరి కఠినమైన లంచ్ కాకుండా మాంసం, కార్బోహైడ్రేట్స్, కూరగాయలు ఉండేలా చూసుకుంటారు.ఇక సాయంత్రం స్నాక్స్ విషయానికి వస్తే.4:30 నుంచి 5 గంటలలోపు స్నాక్స్ పూర్తి చేస్తారు.స్నాక్స్ విషయానికొస్తే ఆయన ఎలాంటి నూనె పదార్థాలను తీసుకోరు కేవలం ఉడకబెట్టిన గింజలు, కాఫీ లేదా జ్యూస్ తాగుతారు.సాయంత్రం డిన్నర్ విషయానికి వస్తే వీలైనంత తొందరగా డిన్నర్ పూర్తి చేస్తారు.

బ్రౌన్ రైస్, కూరగాయలు, చికెన్ లేదా చేపలతో డిన్నర్ పూర్తి చేస్తారు.ఈ విధమైనటువంటి డైట్ ఫాలో అవుతూ తన శరీర ఫిట్నెస్ ను అల్లు అర్జున్ కాపాడుకుంటూ వస్తున్నారు.

Icon Star Allu Arjun Diet Plan Allu Arjun Fitness Pushpa #AlluArjun

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube