పెద్ద‌వాళ్ల‌కు చ‌లి ఎక్కువ‌గా ఉండ‌టంలో గ‌ల సీక్రెట్ ఏమిటో తెలుసా?

ఉత్తర భారతదేశంలో చలి త‌న తీవ్ర‌త‌ను చూపిస్తోంది.చలి కాలంలో సీనియర్‌ సిటిజన్స్ అధికంగా ఆందోళన చెందడం మీరు చూసే ఉంటారు.

 Senior Citizens Feel More Colder Than Young Why Details, Cold, Senior Citizens,-TeluguStop.com

వారికి చలి ఎక్కువగా ఉండ‌టం కార‌ణంగా ఇబ్బంది ప‌డుతుంటారు.ఇంత‌కీ వృద్ధులకు ఎందుకు చ‌లి ఎక్కువగా ఉన్న‌ట్లు అనిపిస్తుంది? వారు జలుబుతో ఎందుకు బాధ‌ప‌డుతుంటారు అనే ప్ర‌శ్న మీమ‌దిలో క‌లిగేవుంటుంది.దానికి కార‌ణ‌మేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.సీనియర్ సిటిజన్ స్పెషలిస్ట్ అండ్ జెరియాట్రిక్ మెడిసిన్ నిపుణులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం చలికాలంలో వృద్ధుల‌కు మ‌రింత‌గా చలిగా అనిపించేందుకు చాలా కార‌ణాలున్నాయ‌న్నారు.

వృద్ధాప్యంలో జీవక్రియ చాలా తక్కువగా ఉంటుందని, ఫ‌లితంగా వారికి అత్య‌ధికంగా చ‌లిగా వుంటుంద‌ని తెలిపారు.

వృద్ధాప్యంలో చర్మం కింద ఉన్న కొవ్వు పొర క్రమంగా సన్నబడుతుందని, ఇది శరీరం యొక్క ఇన్సులేషన్‌ను త‌గ్గిస్తుంద‌ని వైద్యులు తెలిపారు.

దీని ఫ‌లితంగానే వృద్ధులు శీతాకాలంలో మరింత చల్లగా ఉన్న‌ట్లు అనుభూతి చెందుతార‌న్నారు.కాగా శరీరంలోని ఉపరితల సిరలు శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి.అయితే వయసు ప్ర‌భావం కార‌ణంగా ఈ సిరల్లో రక్త ప్రవాహం తగ్గుతుంది. దీని కారణంగా వృద్ధులు మరింత చల్లగా ఉన్న‌ద‌ని చెబుతుంటార‌న్నారు.

థర్మోర్సెప్టర్లు శరీర చర్మంలోని ప్రత్యేక కణాలు, ఇవి ఉష్ణోగ్రతలో వ్యత్యాసాన్ని గుర్తించగలవు.

Telugu Cool, Fat, Senior Citizens, Skin, Telugu, Thermoceptors-General-Telugu

వాటి స్థానం, సంఖ్య కారణంగా అవి చర్మం యొక్క సున్నితత్వాన్ని నిర్ణయిస్తారు.అటువంటి పరిస్థితిలో, వృద్ధుల యొక్క థర్మోసెప్టర్ సాంద్రతలో తగ్గుదల ఉంటుంది.వృద్దులు చ‌ల్ల‌గా ఉంద‌ని చెప్ప‌డానికి ఇది కూడా ఒక కార‌ణ‌మే!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube