శ్రీవిష్ణుని ఏమనాలో అర్థంకావడం లేదు.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.శ్రీ విష్ణు తాజాగా నటించిన చిత్రం అర్జున ఫల్గుణ.

 Dil Raju Comments Sri Vishnu Arjuna Phalguna Movie Pre Release Event, Sri Vishn-TeluguStop.com

ఇందులో శ్రీ విష్ణు సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.తేజ మార్ని దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమా నేడు అనగా డిసెంబర్ 31న థియేటర్ లలో విడుదల అవుతోంది.ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు చిత్ర బృందం.

ఇక ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ హీరో శ్రీ విష్ణు ని ఏమనాలో అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.

నాకు కొత్త కొత్త దర్శకులు కథలు చెప్పినప్పుడు అందులో రెండు మూడు కథలను హీరో శ్రీ విష్ణు తో షేర్ చేస్తాను.కొత్త వారికి ఛాన్స్ ఇస్తూ డిఫరెంట్ సినిమాలు చేస్తున్న నిర్మాతలను అభినందిస్తున్నాను అని తెలిపారు.

ఇక శ్రీ విష్ణు ని హీరో అనాలో లేక ఆర్టిస్ట్ అనాలో అర్థం కావడం లేదు.కానీ సినిమాను లీడ్ చేస్తున్నప్పుడు హీరో అనే అంటాం.

సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అని సంబంధం లేకుండా కొత్త కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు శ్రీ విష్ణు.

Telugu Arjuna Phalguna, Dil Raju, Pre, Sri Vishnu-Movie

అయితే శ్రీ విష్ణు ఏదో ఒకరోజు ఖచ్చితంగా పెద్ద హీరో అవుతాడు.అతను చేస్తున్న ప్రయత్నం అతడిని తప్పకుండా పెద్ద వాడిని చేస్తుంది.అయితే తన ప్రయత్నాలను మాత్రం శ్రీ విష్ణు ఆపకూడదు అని నిర్మాత చెప్పుకొచ్చారు.

అదేవిధంగా కొత్త వారికి అవకాశాలు ఇస్తూ సినిమాలు చేస్తున్న నిర్మాతలను నేను అభినందిస్తున్నాను.వారి ప్రయత్నాలు కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.అర్జున ఫల్గుణ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు నిర్మాత దిల్ రాజు.నేను ఇండస్ట్రీ కి ఉత్తి చేతులతో వచ్చాను.

ప్రస్తుతం నాకు చాలా ఆస్తి వుంది.నేను పరిచయం చేసిన ఆ దర్శకులే నా ఆస్తి అని తెలిపారు.

Telugu Arjuna Phalguna, Dil Raju, Pre, Sri Vishnu-Movie

అనంతరం శ్రీ విష్ణు మాట్లాడుతూ.స్నేహితులైన ఐదుగురు అమాయకులు ఒక చిన్న సమస్యలో ఇరుక్కొని ఆ సమస్య నుంచి ఎలా బయటపడగలిగారు అనేదే ఈ సినిమా కథ అని తెలిపారు.అనంతరం దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ.ఒక వేదికపై మైకు పట్టుకొని నేను మాట్లాడటం ఇదే మొదటిసారి.కొత్త కొత్త దర్శకులకు శ్రీవిష్ణు ఒక ధైర్యం.ధైర్యమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది అని తెలిపారు.

ఇక శ్రీవిష్ణు 15 సినిమాలు చేయగా అందులో దాదాపుగా పది సినిమాల దర్శకులు కొత్త వారే అని తెలిపారు దర్శకుడు కిషోర్ తిరుమల.అనంతరం నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ చాలామంది దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం చేసిన శ్రీ విష్ణు ని నేను ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు హ్యాపీగా ఉంది అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube