విశ్వాసమంటే ఈ కుక్కదే... యజమానురాలి కోసం ఏకంగా...

ఈ ప్రపంచంలో అత్యంత విశ్వాసం ఉన్న జంతువు ఏది అని ఎవరైనా అడిగితే ఠక్కున చెప్పే సమాధానం ఒక్కటే.కుక్క అని.

 Faithful Dog United For The Mistress Details, Dog, Viral Video, Faithful Dog, Pe-TeluguStop.com

అంతలా విశ్వాసంగా ఉంటాయి.కాబట్టే చాలా మంది కుక్కలను పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది కుక్కలను పెంచుకుంటూ ఉన్నారు.వారు తాము చేసే రోజువారీ పనులను కూడా తమ పెంపుడు కుక్కలకు నేర్పిస్తూ ఉంటారు.

ఇలా అవి తమ యజమానులు చేసే పనులను నేర్చుకుని సరదాగా నవ్విస్తాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ కుక్క వీడియో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో కుక్క చేసే చిలిపి పనికి ఎవరైనా సరే వావ్ అనకుండా ఉండలేరు.ఆ కుక్క తన యజమానురాలి కోసం ఏకంగా యజమానురాలి కొడుక్కే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.

ఇంతకీ ఏం జరిగిందంటే… ఓ చోట ఓ వృద్ధ మహిళ తన కొడుకుతో కలిసి టీవీ చూస్తూ ఉంటుంది.మొదట ఆ మహిళ చేతిలోనే రిమోట్ ఉంటుంది.

ఆ మహిళ చూస్తున్న ఛానల్ కొడుక్కి నచ్చకపోవడంతో అతడు తన తల్లి చేతిలో ఉన్న రిమోట్ కాస్త లాక్కొని తనకు నచ్చిన ఛానల్ ను పెట్టుకుంటాడు.

ఆ ఛానల్ నచ్చని ఆ మహిళ తన కొడుకు దగ్గరినుంచి రిమోట్ ను లాక్కుంటుంది.ఇలా ఒకరి దగ్గరి నుంచి ఒకరు రిమోట్ ను లాక్కోవడం చూసిన ఆ కుక్క అలానే గమనిస్తూ ఉంటుంది.కానీ చివరికి తన యజమానురాలి కోసం కదనరంగంలోకి దూకుతుంది.

తన యజమానురాలి కొడుకు చేతిలో ఉన్న రిమోట్ ను నోటితో లాక్కొని తన యజమానురాలికి అందజేస్తుంది.అంతే కాకుండా ఆ వ్యక్తికి వార్నింగ్ ఇస్తుంది.ఈ కుక్క చేసిన ఫన్నీ పనిని వెంటనే చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube