టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన నందమూరి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఏకంగా పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటించే స్థాయికి ఎదిగారు.
ఇక సాధారణంగా ఎన్టీఆర్ అంటేనే మనకు అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడుతూ మాస్ డైలాగులు చెప్పే హీరో మాత్రమే కనబడతారు.సాధారణంగా హీరోలు ఇంగ్లీష్, తెలుగు, మరికొన్ని భాషల్లో మాట్లాడటం సర్వసాధారణం.
అయితే ఎన్టీఆర్ ఎప్పుడు కూడా తెలుగు కాకుండా ఇతర భాష మాట్లాడటం బహుశా చాలా మంది వినక పోవచ్చు.కానీ ఎన్టీఆర్ ఎన్ని భాషల్లో మాట్లాడగలరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాలో కొమురంభీం పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని జనవరి 7వ తేదీ విడుదలకు సిద్ధం కావడంతో ఇప్పటి నుంచి చిత్రబృందం పెద్ద ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇప్పటికే ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలలో ప్రెస్ మీట్ లు పెట్టడం సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడం జరుగుతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన హీరోలు, హీరోయిన్ అలియా భట్ ప్రతి ఒక్క ప్రెస్ మీట్ లో హాజరవుతున్నారు.
ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను ముంబైలో ఎంతో వేడుకగా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ అక్కడ మీడియాతో హిందీలో మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచారు.అలాగే చెన్నై లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తమిళ్, బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కన్నడలో మాట్లాడుతూ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు.ఇక ఈ ప్రెస్ మీట్ చూసిన ఎంతోమంది అభిమానులు ఎప్పుడూ ఎంతో సైలెంట్ గా ఉండే ఎన్టీఆర్ ఇలా ఇన్ని భాషలు మాట్లాడగలరా.! అంటూ ఎంతో మంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఏ నగరాలలో నిర్వహించిన అక్కడ అదే భాషలో మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. శనివారం హైదరాబాద్లో ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా రాజమౌళి, రామ్ చరణ్, అలియా భట్, ఎన్టీఆర్ పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఇక ఈ సినిమా జనవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలను పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ఇటు నందమూరి ఫ్యాన్స్,అటు మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది.