మన దైనందిన జీవితంలో స్నానం చేయడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే.రోజుకు రెండుసార్లు స్నానం చేసే వారు కూడా ఉన్నారు.
ఇక ఎంత చల్లటి వాతావరణం ఉన్నా సరే రోజుకు ఒకసారైనా స్నానం చేస్తుంటాం మనం.ఆరోగ్యంగా ఉండాలన్నా మైండ్ ఫ్రెష్ అవ్వాలన్నా సరే స్నానం చేస్తుంటాం.
ఇంట్లో ఉన్నా సరే మనం స్నానం చేస్తుంటాం.ఇక ఎటు అయినా బయటకు వెళ్తుంటే మాత్రం కచ్చితంగా స్నానం చేస్తాం.
అయితే స్కూలుకు వెళ్లాలంటే మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో అయినా టీచర్లు, స్టూడెంట్లు స్నానం చేసి వస్తుంటారు.
కానీ స్నానం చేయకుండా ఉండే అలవాటు ఎలా ఉంటుందో ఊహించండి.
స్నానం చేయని వారు మన దగ్గరకు వస్తేనే దాన్ని మనం భరించలేం.అలాంటిది ఓ మహిళ మాత్రం ఏకంగా అసలు స్నానం చేయడానికే ఇష్టపడట్లేదు.
వారానికి ఓసారి మాత్రమే అది కూడా ఎంతో బలవంతంగా స్నానం చేస్తుందంట.ఈ విషయం భర్తకు తెలిసినా అతను కూడా ఓకే అన్నాడంట.
వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ.కానీ ఇదే నిజమండి బాబు.
పైగా ఆ మహిళ ఓ టీచర్.అదేంటి టీచర్ అయి ఉండి నలుగురికి ఆదర్శంగా ఉండాలి గానీ ఇలా చేయడమేంటి అని షాక్ అవ్వకండి.

ఇంగ్లాండ్ లో నివసించే ఓ మహిళా టీచర్ కు ఈ వింత అలవాటు ఉంది.ఆమె వారంలో ఒక్కసారి మాత్రమే స్నానం చేస్తుందంట.ఇక తన శరీరం నుంచి ఎలాంటి దుర్వాసన రాకుండా ఉండే క్రీములను కూడా ఆమె ఎప్పుడో ఒకసారి మాత్రమే వాడుతుందని ఆమె తెలిపింది.అయితే భార్యను మార్చాలనే ఉద్ధేశంతో ఆ భర్త ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా విజయం సాధించలేకపోయాడు.
ఆమె మాత్రం రోజూ స్నానం చేసేందుకు ముందుకు రావట్లేదు.ఇక టీచర్ అయి ఉండి కూడా ఆమె ఇలాగే స్కూల్ కు వెళ్తుందని చెబుతున్నారు.
ఇది విని అంతా షాక్ అయిపోతున్నారు.