తెలుగు ప్రేక్షకుల ముందుకు పుష్పక విమానం మళ్లీ వచ్చేందుకు సిద్దం అయ్యింది.
గత నెలలో థియేటర్ల ద్వారా వచ్చిన పుష్పక విమానం సినిమా ను ఆహా వారు ఈ నెలలో స్ట్రీమింగ్ కు సిద్దం చేస్తున్నారు.
నాలుగు వారాల తర్వాత ఈ సినిమా ను స్ట్రీమింగ్ కు సిద్దం చేస్తున్నట్లుగా ఆహా సిద్దం చేసింది.డిసెంబర్ 10వ తేదీ న ఈ షో ను స్ట్రీమింగ్ ను చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం ఆహా లో పలు హిట్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.వాటికి తోడు ఈ సినిమా కూడా స్ట్రీమింగ్ కు రెడీ అవ్వడం జరిగింది.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను ప్రముఖ ఓటీటీ లు స్ట్రీమింగ్ చేసేందుకు ఆసక్తి చూపించాయి.కాని నిర్మాతలు మాత్రం ఆహా వారికి మాత్రమే ఈ షో ను ఇచ్చేందుకు ఆసక్తి చూపించారు.
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ను విజయ్ దేవరకొండ నిర్మించిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంది.
ఈ సినిమా లో హీరో తన భార్య ను వెదుకుతూ ఉంటాడు.పెళ్లి అయిన వెంటనే కనిపించకుండా పోయిన భార్య కోసం అతడి వెదుకులాట ఎంత వరకు వచ్చింది.
అసలు ఆ భార్య ఎటు వెళ్లింది.భార్య కనిపించకుండా పోయిన విషయాన్ని ఎలా అతడు మ్యానేజ్ చేశాడు అనేది ఈ సినిమాలో దర్శకుడు చూపించాడు.
ఆనంద్ దేవరకొండ ఈ సినిమా లో తన నటన తో మెప్పించాడు.మొదట గా ఈ సినిమా కథను రెడీ చేసిన సమయంలో కొత్త హీరోతో అనుకున్నారట.కాని ఎవరు కూడా ఈ సినిమాను చేసేందుకు ఆసక్తి చూపించక పోవడంతో ఆనంద్ దేవరకొండ స్వయంగా రంగంలోకి దిగాడని సమాచారం అందుతోంది.
కాస్త విభిన్నమైన కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొంది మెప్పించింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy