పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మలయాళ రీమేక్ చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే .
ఈ సినిమాకు సాగర్ కే.చంద్ర దర్శకత్వం వహిస్తున్న స్క్రీన్ ప్లే, మాటలను త్రివిక్రమ్ శ్రీనివాస్ చూసుకుంటున్నారు.ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.ఇక ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు రానా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా టైటిల్స్ ఉంటాయి.అలాంటి టైటిల్ కోసం చిత్రబృందం ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంపిక చేసుకుంటారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రానికి ముందుగా భీమ్లా నాయక్ కాకుండా “అసుర సంధ్య వేళలో” అనే టైటిల్ పెట్టాలని భావించారట.సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటికి అ అనే అక్షరంతో పేర్లు పెడుతుంటారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాకి కూడా అసుర సంధ్య వేళలో అనే టైటిల్ పెట్టాలని మొదట్లో భావించినప్పటికీ ఈ టైటిల్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదన్న ఉద్దేశంతోనే ఈ చిత్రానికి భీమ్లా నాయక్ అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తుంది.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి అయిందని వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇందులో నిత్యమీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.