టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ లోకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చేసింది.బాలీవుడ్ ప్రేక్షకులు అమితంగా ఆరాధించే అభిమానించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ 2 లో సమంత నటించింది.
ఆ వెబ్ సిరీస్ ఆమెకు మంచి విజయాన్ని సొంత చేసి పెట్టింది.ఆ వెబ్ సిరీస్ లోని రాజీ పాత్రకు సమంత తప్ప మరెవ్వరు న్యాయం చేసి ఉండే వారు కాదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
అదే సమయంలో ఆ పాత్ర వల్లే సమంత విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అనే విమర్శలు కూడా ఉన్నాయి.మొత్తానికి రకరకాలుగా ఉన్న వార్తలు ఏమో కాని తాజాగా ఒక మీడియా ఇంట్రాక్షన్ లో ఆసక్తికర విషయాలను వెళ్లడించింది.
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రాజీ పాత్ర నా వద్దకు వచ్చిన సమయంలో నేను ఆశ్చర్యపోయాను.తప్పకుండా ఇలాంటి పాత్ర ఒకటి అయినా కెరీర్ లో చేయాలని.
ఇలాంటి పాత్రల్లో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా కాదనదు అంటూ సమంత చెప్పుకొచ్చింది.
నటిగా మంచి పేరు దక్కించుకోవడంతో పాటు ఎక్కువ మందికి చేరువ అయ్యే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఆ పాత్రను వదులుకుంటారు అంటూ సమంత ప్రశ్నిస్తుంది.పూర్తిగా ఆలోచించిన తర్వాత సమంత ఆ పాత్రను చేసినట్లుగా క్లారిటీ వచ్చేసింది.ఇక సమంత తెలుగు లో శాకుంతలం అనే సినిమా చేసింది.
ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది.మరో వైపు తమిళంలో కూడా నయనతార మరియు విజయ్ సేతుపతితో కలిసి నటించిన సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.
ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది.ఇక సమంత కొత్త జర్నీ పూర్తిగా బాలీవుడ్ లో ఉండబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.ఒక వేళ బాలీవుడ్ కు ఈ అమ్మడు వెళ్తే ఖచ్చితంగా మంచి విజయాలను దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.